FactCheck: రామోజీ పైశాచికత్వం  

16 Sep, 2023 03:48 IST|Sakshi

రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌ లీవుపై ‘ఈనాడు’ సైకో రాతలు 

ప్రభుత్వ పెద్దలే పంపించేశారని, అక్కడ కుట్ర జరుగుతోందని విషప్రచారం 

దీనికి ఊహలు, అభూతకల్పనలు జోడిస్తూ చెలరేగిపోయిన టీడీపీ.. జైల్లో భద్రతపై అనుమానాలంటూ కోర్టులోనూ అదే వాదన 

వాస్తవానికి భార్యను ఆసుపత్రిలో చేర్చటంతో లీవు పెట్టిన రాహుల్‌ 

 శుక్రవారం ఆయన భార్య కిరణ్మయి మృతి; జైళ్ల శాఖ డీఐజీ పరామర్శ 

ఎల్లో ముఠా ఇంతలా దిగజారిపోవటంపై విస్తుపోతున్న జనం 

బాబు దొంగతనాన్ని కప్పిపుచ్చేందుకు ఎక్కడికక్కడ ఎల్లో డ్రామాలు 

ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు 

ఎల్లో పత్రికల వార్తలతో ‘ఇవీ నిజాలు..’ అంటూ ఓ వెబ్‌సైట్‌ కూడా 

అడ్డంగా దొరికిపోయి ఇంత బుకాయింపా అంటూ నిపుణుల నివ్వెరపాటు  

సాక్షి, అమరావతి: ‘ఈనాడు’ పత్రిక, దాన్ని నడిపిస్తున్న రామోజీరావు ఇంత పైశాచికంగా ఆలోచిస్తున్నారెందుకు? తెలుగుదేశం పార్టీ దారుణంగా దిగజారిపోయి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ‘ఈనాడు’ కూడా తన సొంత స్టోరీల మాదిరిగా రాస్తూ ఎందుకింత నీచానికి ఒడిగడుతోంది? ఒక జైలు సూపరింటెండెంటు... అనారోగ్యంతో ఉన్న తన భార్య ఆరోగ్యం విషమించిందని తెలుసుకుని అప్పటికప్పుడు సెలవు పెట్టి వెళితే దానిక్కూడా ఊహలు, అతిశయోక్తులు జోడించి ‘రాజమండ్రి జైల్లో ఏం జరుగుతోంది?’ అంటూ కథనాన్ని వండేశారంటే ఏమనుకోవాలి?

చంద్రబాబుతో, పవన్‌ కళ్యాణ్, లోకేశ్, బాలకృష్ణ ములాఖత్‌ అయిన కాసేపటికే జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ సెలవు పెట్టారని, ప్రభుత్వ పెద్దలు బలవంతంగా సెలవుపై పంపించటం వల్లే ఇదంతా జరుగుతోందని, జైలును కుట్రలకు కేంద్రంగా మారుస్తున్నారని... ఇలా చేతికొచ్చిన అక్షరాలన్నిటినీ రాసేసింది. దాన్నే తెలుగుదేశం పార్టీ తన విషప్రచారానికి వాడుకుంటోంది. జనం మెదళ్లలో వీలైనంత విషం నింపటానికి ఎల్లో ముఠాలన్నీ ఒక్కటై సాగిస్తున్న ఈ దుష్ప్రచారం హద్దుల్లేకుండా సాగిపోతోంది.  

భార్య అనారోగ్యం అని చెప్పినా.... 
వాస్తవానికి జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ భార్య కిరణ్మయి (46) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఔట్‌ పేషెంట్‌గానే చికిత్స పొందుతున్న కిరణ్మయిని.. ఆరోగ్యం విషమించటంతో ఈ నెల 14న ఆసుపత్రిలో చేర్చారు. ఆమెను దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో రాహుల్‌ కూడా సెలవు పెట్టారు. దురదృష్టవశాత్తూ పరిస్థితి విషమించి శుక్రవారం ఆమె మరణించారు కూడా. ‘ఈనాడు’ పత్రిక గానీ, టీడీపీ గానీ ఇలాంటి వార్త రాసేముందు రాహుల్‌ సెలవు పెట్టిన కారణాన్ని తెలుసుకుని... అది వాస్తవమో కాదో ఒక్కసారి ధ్రువపరుచుకుని ఉంటే సరిపోయేది.

అలా చేస్తే.. ఇంతటి హేయమైన, నీచమైన దౌర్భాగ్యపు రాతలు రాసి ఉండేవారు కాదేమో!!. వాస్తవానికి అలా అనుకోవటానికి లేదు. ఎందుకంటే వీళ్లెవరికీ నిజాలతో పనిలేదు. నిజం తెలిసినా దాన్ని బయటకు చెప్పరు కూడా. ఎన్ని అబద్ధాలు చెప్పయినా... జనం మెదళ్లలో ఎంతటి విషాన్ని నింపయినా చంద్రబాబును వీలైతే జైల్లోంచి బయటకు తేవటం, లేకపోతే సానుభూతి సంపాదించి రాజకీయంగా లబ్ధి పొందటమే వాళ్ల లక్ష్యాలు. దీనికోసం తాము అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా సంపాదించిన కోట్ల రూపాయల డబ్బు మూటల్ని వెదజల్లటానికి ఎల్లో ముఠా వెనకాడటం లేదు.

కోట్లాది రూపాయలు ఫీజులివ్వటంతో పాటు ప్రత్యేక విమానాల్లో లాయర్లను తీసుకురావటం... దత్తపుత్రుడితో సహా కుటుంబ సభ్యులంతా హైదరాబాద్‌ – విజయవాడ– ఢిల్లీ అంటూ స్పెషల్‌ ఫ్లైట్లలో తిరుగుతుండటం... జాతీయ మీడియాకు ఢిల్లీలో చినబాబు లోకేశ్‌ ఇంటర్వ్యూలు... స్కిల్‌డెవలప్‌మెంట్‌పై నిజాలు అంటూ గాలి మాటలతో ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించటం.. ఇవన్నీ ఈ అక్రమ సంపాదనకు పుట్టిన సంతానమే అనుకోవాలి.  

దొంగతనం చేసి ఇంత యాగీ చేయటమా? 
దేశంలోనే కాదు... ఒక దొంగని అరెస్టు చేస్తే ఇంత యాగీ చెయ్యటమనేది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఒక్క ఏపీలో తప్ప... అదీ చంద్రబాబునాయుడి విషయంలో తప్ప. ఒకవైపేమో సీమెన్స్‌ సంస్థ తమతో ఎవరూ ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదని చెబుతోంది... కానీ ఎల్లో మీడియా మాత్రం సీమెన్స్‌ పెద్ద సంస్థకాదా? సీమెన్స్‌ అంతర్జాతీయ దిగ్గజం కాదా? అని వాదిస్తోంది. నిజాలకు మసిపూస్తోంది. నిజంగా సీమెన్స్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టే ఎదురు ప్రశ్నలు వేస్తోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ తరఫున విడుదల చేసిన డబ్బులు బయటకు పోయాయన్నది నిజం. అవి సీమెన్స్‌కు చేరలేదని ఆ సంస్థే చెబుతోంది.

అవి షెల్‌ కంపెనీల ద్వారా చంద్రబాబును చేరాయని కేంద్ర దర్యాప్తు సంస్థలే తేల్చాయి. మరి ఇంత రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయి కూడా.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల సంఘీభావమంటూ, బెంగళూరులో తమకు మద్దతు తెలిపారంటూ పదేసి మందిని పోగేసి ఇంత యాగీ చేయటమెందుకు? మణిపూర్‌ పోరాట యోధురాలు ఇరోమ్‌ షర్మిల ద్వారా కూడా ట్వీట్‌ చేయించారంటే చంద్రబాబు ఎల్లో నెట్‌వర్క్‌ ఏ స్థాయిలో ఉందో చెప్పకనే తెలుస్తుంది.

అసలు ఇరోమ్‌ షర్మిలకు ఏపీ గురించి తెలుసా? ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? చంద్రబాబు ఎంత లూటీ చేశాడో తెలుసా? నిజంగా తప్పు చేయకపోతే... తాము అన్నీ సక్రమంగానే చేసి ఉంటే ఆ విషయాలన్నీ కోర్టులో చెప్పొచ్చు కదా? చంద్రబాబును వదిలేయాలంటూ వాట్సాప్‌ మెసేజ్‌లు, ఆడియో సందేశాలు... ఎందుకిదంతా? 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు... ఈ  40 ఏళ్లుగా తాను పెంచి పోషించిన విష వ్యవస్థను తనకు మద్దతివ్వటానికి ఉపయోగించుకుంటున్నారని తెలియటానికి ఇంకేం కావాలి? తనకు వ్యతిరేకంగా తీర్పునిస్తే న్యాయమూర్తిపై కూడా దారుణంగా దు్రష్పచారం చేసిన ఈ ఎల్లో ముఠా తన అబద్ధాలతో ఇంకెన్నాళ్లు మనుగడ సాగించగలదు?. 

సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ భార్య కిరణ్మయి మృతి 
కంబాలచెరువు (రాజమహేంద్రవరం):రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ సతీమణి కిరణ్మయి (46) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో కిరణ్మయి బాధపడుతున్నారు. ఆమెకు ఆరోగ్యం బాగోకపోవడంతో నగరంలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్, కిరణ్మయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. 

పోలీసు యంత్రాంగం తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది 
స్థితిగతులు తెలుసుకుని వాస్తవాలను ప్రచురించండి 
జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్,తూర్పు గోదావరి ఎస్పీ పి.జగదీష్‌ 

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు యంత్రాంగం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోందని, స్థితిగతులు తెలుసుకుని రాయాలని, అవాస్తవాలను ప్రచురించవద్దని కోస్తా, ఆంధ్ర రీజియన్‌ జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి.జగదీష్‌ చెప్పారు. సెంట్రల్‌ జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ భార్య కిరణ్మయి అనారోగ్యంతో మృతిచెందడంతో డీఐజీ రవికిరణ్, ఎస్పీ జగదీష్‌ శుక్రవారం హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి సూపరింటెండెంట్‌ను పరామర్శించి ఓదార్చారు.  

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  పలు వార్తాపత్రికల్లో జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌ సెలవుపై వెళ్లిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తపరుస్తూ వార్తలు వచ్చాయ­న్నారు. ఆయన సతీమణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈ నెల 14న ఉదయం 6గంటలకు ఆసు­పత్రిలో చేర్చారన్నారు.  ఆమెను చూసుకునేందుకు రాహుల్‌ రెండు రోజులు సెలవుపై వెళ్లారన్నారు. దీనికి ఈ ఒక్క కారణమే తప్ప మరేకారణం లేదన్నారు. రాహుల్‌ భయ­పడి వెళ్లిపోయారు, అధికారులు బలవంతంగా పంపించారు అనేవి పూర్తిగా అవాస్తవాలన్నారు. 
 

మరిన్ని వార్తలు