విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు సమంజసం కాదు

7 Dec, 2020 20:11 IST|Sakshi

మాజీ ఆర్టీఐ కమిషనర్ విజయబాబు

సాక్షి, విజయవాడ: స్వప్రయోజనాల కోసం ఎన్నికల కమిషనర్ పని చేయకూడదని, ఇతర రాష్ట్రాలతో ఏపీని పోల్చాల్సిన అవసరం లేదని మాజీ ఆర్టీఐ కమిషనర్ విజయబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ పునరాలోచన చేయాలని సూచించారు. ‘‘ఎన్నికలను ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని నిర్వహిస్తామని చెప్పడం భావ్యం కాదు. బీహార్ ఎన్నికల తర్వాత కోవిడ్ కేసులు పెరగటం చూశాం. హైదరాబాద్ ఎన్నికల్లో ఓటర్లు కోవిడ్ భయానికి ప్రజలు ఓటు వేసేందుకు కూడా రాని పరిస్థితి చూశాం. యూఎస్ అధ్యక్ష ఎన్నికల తర్వాత కూడా అధికసంఖ్యలో యూఎస్‌లో కేసులు పెరిగాయని’’ ఆయన పేర్కొన్నారు.

ఎన్నికల కమిషనర్ ఓ పార్టీ కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు కనిపిస్తుందని.. రాజ్యాంగానికి లోబడి పనిచేయాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలను లెక్క చేయకుండా ఎస్‌ఈసీ వ్యవహరిస్తున్నారని విజయబాబు విమర్శించారు.

మరిన్ని వార్తలు