మోస పోయాం.. న్యాయం చేయండయ్యా!

21 Aug, 2021 21:51 IST|Sakshi
గిద్దలూరు సీఐ ఫిరోజ్‌ను వేడుకుంటున్న బాధితురాలు  

కొమరోలు: మోస పోయిన తమకు న్యాయం చేయాలంటూ పోలీసుస్టేషన్‌ వద్ద శుక్రవారం ధర్నా చేశారు. బాధిత కుటుంబం కథనం ప్రకారం.. మండలంలోని రెడ్డిచెర్ల గ్రామానికి చెందిన సూరె బాలస్వామి, మరియమ్మ దంపతుల కుమార్తెకు బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ కాశయ్యతో వివాహం చేయాలని మూడు నెలల క్రితం పెద్దలు నిశ్చయించారు. బాలస్వామి కుమార్తెను వివాహం చేసుకునేందుకు కాశయ్య నిరాకరించి వేరే వివాహం చేసుకున్నాడు.

అప్పటికే పెళ్లి నిశ్చయం కావడంతో బాలస్వామి కుటుంబ సభ్యులు కాశయ్య కుటుంబానికి రూ.5 లక్షలు కట్నకానుకలు అందజేశారు. అవి తిరిగి ఇవ్వక పోవడంతో పోలీసు స్టేషన్‌లో బాలస్వామి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మూడు నెలలుగా స్థానిక ఎస్‌ఐ సాంబశివయ్య పట్టించుకోవడం లేదంటూ పోలీసు స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు. ఆ సమయంలో గిద్దలూరు సీఐ ఫిరోజ్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకొని మాట్లాడుతూ కేసు నమోదు చేశామని, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు వెనుదిరిగారు.

చదవండి: ఇద్దరు యువకులు కాడెద్దులుగా మారి పొలాన్ని

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు