ఫుట్‌బాల్‌కూ ప్రాధాన్యత

30 Oct, 2023 04:22 IST|Sakshi

ఏపీ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌

యలమంచిలి(అనకాపల్లి రూరల్‌) : క్రికెట్‌తో పాటు రాష్ట్రంలో ఫుట్‌బాల్‌ క్రీడకూ సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నామని ఏపీ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ తెలిపారు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలోని రాజీవ్‌ క్రీడా మైదానంలో ఆదివారం యలమంచిలి–విశాఖపట్నం జట్ల మధ్య జరిగిన ఫుట్‌బాల్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన ఫుట్‌బాల్‌ క్రీడాకారులను గుర్తించి, వారికి మంచి తర్ఫీదు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.

ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన ఫుట్‌బాల్‌కు మన దేశంలో ఆదరణ తక్కువగా ఉందని, దీనిని పెంచడానికి ఏపీ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతోందని తెలిపారు. భవిష్యత్‌లో రాష్ట్రం నుంచి ప్రపంచస్థాయి క్రీడాకారులను తయారుచేసేందుకు కృషి చేయనున్నట్టు చెప్పారు. ఆసక్తి ఉన్న గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు తమవంతు సహాయ, సహకారాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అంతకుముందు స్థానిక రాజీవ్‌ క్రీడా మైదానంలో యలమంచిలి, విశాఖ జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్న శ్రీధర్‌ రెండు జట్ల మధ్య నిర్వహించిన ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ను తిలకించారు.  ఈ కార్యక్రమంలో ఏపీ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ హెడ్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ ఆర్‌ రాజే‹Ù, కోనసీమ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నీలాద్రి, ఎన్‌ఐఎస్‌ చీఫ్‌ కోచ్‌ ఎం.శేషుమోహన్, ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్‌ ఎస్‌జీ రామకృష్ణ  తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు