మీరెప్పుడూ చూడని ఫుట్‌బాల్‌ గేమ్‌.. నెట్టింట వైరల్‌

4 Nov, 2023 12:42 IST|Sakshi

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఆట ఫుట్‌బాల్. ఈ ఆటలో క్రీడాకారులు మైదానంలో చిరుతల్లా పరిగెత్తుతూఅద్భుతమైన గోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. నియమిత సమయంలో ఏ జట్టు అయితే ఎక్కువ గోల్స్‌ చేస్తారో వాళ్లను విజేతలుగా నిర్ణయిస్తారు. ఇదంతా.. ఇప్పటివరకు మనకు తెలిసిన ఫుట్‌బాల్‌ గేమ్‌. కానీ ఇప్పుడు ఓ వెరైటీ ఫుట్‌బాల్‌ గేమ్‌ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో అంత స్పెషల్‌ ఏంటో తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే..

సాధారణంగా ఫుట్‌బాల్‌ ఆడాలంటే జట్టుకు 11మంది సభ్యులు ఉంటారు. కానీ ఈ వెరైటీ ఫుట్‌బాల్‌లో మాత్రం కేవలం ఇద్దరి మధ్యే పోటీ ఉంటుంది. ఇక వీళ్లకు వందల అడుగుల విస్తీర్ణం ఉన్న మైదానం కూడా అవసరం లేదు. కేవలం రెండు టేబుల్స్‌ పట్టేంత స్థలం ఉంటే చాలు. అయితే ఫుట్‌బాల్‌ గేమ్‌ మాదిరిగా వీళ్లు కూడా బంతిని చేతితో తాకకుండా కాలితో తమ ప్రత్యర్థి సెట్‌లోకి ఎవరైతే ఎక్కువ సార్లు బంతిని వేస్తారో వాళ్లే విజేతలుగా పరిగణించారు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.దీంతో.. ఫుట్‌బాల్‌ను ఇలా కూడా ఆడతారా అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. గ్లాస్‌ ఫుట్‌బాల్‌ని ఎప్పుడూ చూడలేదు. భలే వెరైటీగా ఉందంటూ అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు