28న గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం 

26 Aug, 2021 21:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఈ నెల 28న గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం జరుగనుంది. 13 మందికి భాషా సేవా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. శలాక రఘునాథ శర్మ, మొవ్వ వృషాద్రిపతి, డా.కోడూరి ప్రభాకర్‌రెడ్డి, వాడ్రేవు సుందరరావు, వెలమల సిమ్మన, డా.కంపల్లె రవిచంద్రన్‌, డా.ఉపద్రష్ట వేంకట రమణమూర్తి, ఎస్‌ సుధారాణి, జిఎస్‌ చలం, కెంగార మోహన్‌, షహనాజ్ బేగం, మల్లిపురం జగదీష్‌, పచ్చా పెంచలయ్య ఈ పురస్కారాలు అందుకోనున్నారు.

మరిన్ని వార్తలు