వర్క్‌ ఫ్రం హోమ్‌ టౌన్‌గా గైట్‌

18 Nov, 2021 10:27 IST|Sakshi

Gandhi Institute of Engineering and Technology: కోవిడ్‌ 19 ప్రభావంతో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో వర్క్‌ ఫ్రం హోమ్‌లో ఉన్న ఐటీ ఉద్యోగుల సౌకర్యార్థం గైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను వర్క్‌ ఫ్రం హోమ్‌ టౌన్‌ (డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ)గా ఎంపిక చేశారు. ఇంటి వద్దనే ఉంటూ విధులు నిర్వహిస్తున్న ఐటీ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టుకు తూర్పు గోదావరి జిల్లాలో ఎంపికైన ఏకైక ప్రైవేట్‌ కళాశాల గైట్‌ అని ప్రిన్సిపాల్‌ పీఎంఎంఎస్‌ శర్మ బుధవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు.

హైస్పీడ్‌ నెట్‌ వర్కుతోపాటు వీడియో కాన్ఫెరెన్స్‌ అవసరమైన అత్యాధునిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న వారు 9988853335కి ఫోన్‌ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. లేకుంటే గైట్‌ వెబ్‌సైట్‌లో గానీ, డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ వెబ్‌సైట్‌లోగాని నమోదు చేసుకోవచ్చన్నారు.

మరిన్ని వార్తలు