రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు: గిరిజా శంకర్‌

10 Jan, 2022 17:43 IST|Sakshi

సాక్షి, అమరావతి: రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 50 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

చదవండి: ఆర్జీవీతో భేటీ.. మంత్రి పేర్ని నాని ఏం చెప్పారంటే..

‘‘ఇప్పటి వరకు 17 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. రోజుకి 50 వేల నుండి లక్ష మెట్రిక్ టన్నులను కొంటున్నాం. రైతులకు 21 రోజుల్లో ధాన్యం డబ్బులు ఇస్తున్నాం రూ.1,153 కోట్లు రైతులకు డబ్బులు చెల్లించాం. మిల్లర్ల ప్రమేయం లేకుండా ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ఈ సారి నూరు శాతం ఈ క్రాప్ చేశాం. అక్రమాలకు ఆస్కారం లేకుండా ఈ క్రాప్ డేటాని వినియోగిస్తున్నాం. ప్రతి రైతు ఖాతాని ఆధార్‌కి అనుసంధానం చేశాం.

దళారులు లేకుండా నేరుగా రైతు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. 80 శాతం మందికి డబ్బులు ఇవ్వడం లేదనడం అవాస్తవం. 21 రోజులు పూర్తయిన వారికి డబ్బులు ఇస్తున్నాం. తప్పుడు వార్తలు రాసిన పత్రికలకు లీగల్ నోటీసులు ఇస్తున్నాం. పోర్టిఫైడ్ బియ్యం ఎక్కువ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. అందుకు అవసరమైన యంత్రాలను మిల్లులలో ఏర్పాటు చేస్తున్నాం. కడప, విశాఖపట్నంలో పోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలని నిర్ణయించామని గిరిజా శంకర్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు