ఏపీకి రూ.4,052 కోట్ల జీఎస్టీ బకాయిలు

20 Jul, 2021 04:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం రూ.4,052 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాల్సి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. జీఎస్టీ బకాయిలపై లోక్‌సభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. స్పెషల్‌ బారోయింగ్‌ ప్లాన్‌లో భాగంగా 2020–21కి సంబంధించి రూ.1.10 లక్షల కోట్లు, 2021–22కి సంబంధించి రూ.1.59 లక్షల కోట్లను రాష్ట్రాలకు అందించాలని జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుందని వివరించారు.

ఈనెల 15న రాష్ట్రాలకు రూ.75,000 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. ఇంకా ఏపీకి 2020–21కి రూ.2,493 కోట్లు, 2021–22కి సంబంధించి రూ.1,559 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిపారు. తెలంగాణకు 2020–21కి గాను రూ.2,515 కోట్లు, 2021–22కి సంబంధించి రూ.1,558 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు