మహనీయుల స్ఫూర్తితో ఉత్తమ న్యాయవాదులుగా ఎదగండి 

18 Sep, 2023 04:49 IST|Sakshi

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శేషసాయి 

చిలకలపూడి (మచిలీపట్నం): సహనంలో మహాత్మాగాందీ, జ్ఞానంలో బీఆర్‌ అంబేడ్కర్, ధైర్యంలో అల్లూరి సీతారామరాజు, సాహసంలో టంగుటూరి ప్రకాశం పంతులును ఆదర్శంగా తీసుకున్నప్పుడే సంపూర్ణ న్యాయవాదులుగా ఎదుగుతారని హైకోర్టు న్యాయమూర్తి, కృష్ణా జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్మించిన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు మొదటి అంతస్తు భవనాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.  

బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్‌ శేషసాయి మాట్లాడారు. న్యాయ వ్యవస్థకు ఎంతో మంది గొప్ప న్యాయమూర్తులు, న్యాయవాదులను అందించిన ఘనత మచిలీపట్నం బార్‌ అసోసియేషన్‌కు ఉందన్నారు. జస్టిస్‌ కృపాసాగర్‌ మాట్లాడుతూ..తన సొంత బార్‌ అసోసియేషన్‌ అయిన మచిలీపట్నం బార్‌ అసోసియేషన్‌కు రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు