మాన్సాస్‌ భూముల వ్యవహారంపై విచారణ

24 Jun, 2021 17:37 IST|Sakshi

ఫిర్యాదులపై విచారణకు ఆరు కమిటీల ఏర్పాటు

సాక్షి, విశాఖపట్నం: మాన్సాస్‌ భూముల వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్థన్‌ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఫిర్యాదులపై విచారణకు ఆరు కమిటీలను ఏర్పాటు చేశారు.

మాన్సాస్‌ భూముల రికార్డులు మొత్తం డిజిటైజేషన్‌, మాన్సాస్ భూముల సర్వే, భూముల రికార్డుల్లో వాస్తవాల పరిశీలన, మాన్సాస్ భూముల్లో ఇసుక తవ్వకాలపై విచారణ, మాన్సాస్  కార్యాలయాల రికార్డుల తనిఖీలు చేపట్టడంతో పాటు, మాన్సాస్ విద్యాలయాల నిధుల వినియోగంపై మరో కమిటీ ఆరా తీయనుంది. నెల రోజులు గడువుగా నివేదిక ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. మన్సాస్‌కు చెందిన 14 వేల ఎకరాల భూమితో పాటు సీతారామ వేణుగోపాలస్వామి అలయాలకు చెందిన ఆరు వేల ఎకరాల భూముల బదలాయింపుపై కూడా కమిటీ విచారణ చేపట్టింది.

చదవండి: మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి డైరెక్టర్ల మధ్య వివాదం
మచిలీపట్నంలో టీడీపీ కార్పొరేటర్‌ వీరంగం 

మరిన్ని వార్తలు