సక్సెస్‌ మంత్ర: రైతు బిడ్డ నుంచి ఇస్రో శాస్త్రవేత్తగా..

31 May, 2021 09:35 IST|Sakshi
అవార్డు అందుకుంటున్న కున్హికృష్ణన్‌ (ఫైల్‌)  

బహుముఖ ప్రజ్ఞాశాలి కున్హికృష్ణన్‌

పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల సక్సెస్‌ మంత్ర ఆయనదే

36 ఏళ్లు ఇస్రోకు సేవలు

నేడు ఉద్యోగ విరమణ చేయనున్న ఇస్రో డైరెక్టర్‌ కున్హికృష్ణన్‌  

సూళ్లూరుపేట: కేరళలోని కన్నూరు జిల్లా పయ్యనూర్‌ అనే మారుమూల గ్రామంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జని్మంచిన కున్హికృష్ణన్‌ ఇస్రో శాస్త్రవేత్త, ప్రొఫెసర్‌ యూఆర్‌రావు స్పేస్‌ సెంటర్‌ (బెంగళూరు) డైరెక్టర్‌ పి.కున్హికృష్ణన్‌ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు గడించారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగాలను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి సక్సెస్‌ను అందించిన ఘనత ఆయనదే.

1986లో ఇస్రోలో ప్రవేశం  
కేరళలోని పయ్యనూరులోనే కున్హికృష్ణన్‌ ప్రాథమిక విద్యాభాసం. 1981లో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్, మ్యాథ్స్‌ గ్రాడ్యుయేట్‌ పూర్తి చేశారు. త్రివేండ్రం యూనివర్సిటీలో ఎల్రక్టానిక్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌లో 1986లో పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం కేరళలోని త్రివేండ్రం విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎస్‌ఎస్‌సీ)లో మెకానిజం వెహికల్‌ ఇంటిగ్రేషన్‌ అండ్‌ టెస్‌లో ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరారు. ఈ విభాగంలో మంచి పరి«ణితి సాధించిన తర్వాత 2009లో పీఎస్‌ఎల్‌వీ సీ12, పీఎస్‌ఎల్‌వీ సీ13 , పీఎస్‌ఎల్‌వీ సీ15 ప్రయోగాలకు అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా పని చేస్తూ వీఎస్‌ఎస్‌సీ నుంచి షార్‌కి వచ్చి ప్రయోగాలు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి విజయవంతం చేశారు.

పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ఇంటిగ్రేషన్‌ విషయంలో మంచి ఫలితాలు చూపించడంతో పీఎస్‌ఎల్‌వీ సీ 15 ప్రయోగం నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ 27 వరకు 13 పీఎస్‌ఎల్‌వీ ప్రాజెక్ట్‌లకు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసి అన్ని ప్రయోగాలను విజయవంతం చేశారు. ఆ తర్వాత ఆయన షార్‌ డైరెక్టర్‌గా పదోన్నతి కలి్పంచి షార్‌ డైరెక్టర్‌గా 2015 నుంచి 2018 దాకా సక్సెస్‌ పుల్‌ డైరెక్టర్‌గా పేరు గడించారు. ఆయన డైరెక్టర్‌గా పని చేసిన కాలంలో 17 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు, ఐదు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు చేశారు. ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకమైన మంగళ్‌యాన్‌–1 ప్రయోగానికి ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరించింది కూడా పి కున్హికృష్ణన్‌ కావడం విశేషం. ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కే శివన్‌ ఇతని ప్రతిభను గుర్తించి బెంగళూరులోని ప్రొఫెసర్‌ యూఆర్‌రావు స్పేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ (ఉపగ్రహాల తయారీ కేంద్రం)కు బదిలీ చేశారు. ఇస్రోలో అన్ని రకాలుగా సేవల అందించి దేశానికి ఉపయోగపడిన కున్హికృష్ణన్‌ సోమవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు.

ఎన్నో అవార్డులు
2010 : మొట్టమొదటగా ఇస్రో ఇండిజువల్‌ మెరిట్‌ ఆవార్డును అందుకున్నారు.
2011 : ఆస్ట్రోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అవార్డు
2013 : పీఎఫ్‌ఎల్‌వీ సీ25–మంగళ్‌యాన్‌–1 ప్రయోగాన్ని సక్సెస్‌ పుల్‌గా నిర్వహించినందుకు ఇస్రో టీమ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు టీమ్‌ లీడర్‌గా అందుకున్నారు.
2013 : ఇస్రో ఫెర్ఫార్మెన్స్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు.
2015 : స్వదేశీ శాస్త్ర పురస్కార్‌
2017 : మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం విజ్ఞాన్‌ ప్రతిభా సమ్మాన్‌ అవార్డు.
2018 : ఇస్రో అవుట్‌ స్టాండింగ్‌ అచీవ్‌ మెంట్‌ ఆవార్డు.
2020 : తమిళనాడు స్టేట్‌ సెంటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఇండియా)వారు ఎమినెంట్‌ ఇంజినీర్‌ అవార్డులను అందుకున్నారు.

చదవండి: నైపుణ్య కళాశాలలు: ఏపీ సర్కార్‌ కీలక ముందడుగు..    
వారెప్పటికీ అనాథలు కారు..! 

 

మరిన్ని వార్తలు