ఆర్బీకేలను పీఏసీఎస్‌లతో అనుసంధానించండి

6 May, 2022 04:55 IST|Sakshi

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)తో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌)ను అనుసంధానం చేసి గ్రామ స్థాయిలో రైతులకు అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆదేశించారు. విజయవాడలోని ఆప్కాబ్‌ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ చైర్‌పర్సన్లు, సీఈవోలతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పాతుకుపోయిన ప్రతి ఒక్కరినీ బదిలీ చేయాలని సూచించారు. 2021–22లో 40 శాతం వృద్ధి రేటుతో ఆప్కాబ్‌ మంచి ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు.

వ్యవసాయ రుణాల పంపిణీలో రాష్ట్రంలో సహకార బ్యాంకులు 4వ స్థానంలో ఉండటం సంతోషకరమన్నారు. ఇదే స్ఫూర్తితో వాణిజ్య బ్యాంకులకు ధీటుగా మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేయాలని సూచించారు. ఆప్కాబ్‌తో సహా డీసీసీబీలన్నీ లాభాల బాట పట్టాయంటే అందుకు ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలే కారణమన్నారు. అనంతరం పీఏసీఎస్‌ అడాప్షన్‌ పాలసీ, 59వ వార్షిక పరిపాలనా రిపోర్ట్, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ పాలసీ, ఉద్యోగుల కోసం రూపొందించిన ‘కాబ్‌నెట్‌’ మొబైల్‌ యాప్‌ను మంత్రి ఆవిష్కరించారు. 

మరిన్ని వార్తలు