రవి కుమార్‌ నుంచి వివరణ తీసుకున్నాం: కాకాణి

17 Mar, 2022 18:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌పై ఆరోపణలు చేసిన కూన రవికుమార్‌పై విచారణ జరిపినట్లు ప్రివిలేజ్‌ కమిటీ చైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. గురువారం ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వ్యక్తిగతంగా హాజరు కావాలని కూన రవి కూమార్‌కు సూచించామని తెలిపారు. అయితే ఆయన అప్పుడు రాలేదని చెప్పారు. కున రవికుమార్‌ ఈరోజు(గురువారం) వ్యక్తిగతంగా వచ్చి హాజరయ్యారని తెలిపారు.

కునరవికుమార్‌ చేసిన ఆరోపణలను చాలా సీరియస్‌గా తీసుకున్నామని కాకాని గోవర్ధన్‌రెడ్డి అన్నారు. దానిపై ఆయన నుంచి వివరణ కూడా తీసుకున్నామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చిస్తున్నామని, రవికుమార్ ఇచ్చిన వివరణను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రివిలేజ్ కమిటీ ఎదుట ఉన్న పిటిషన్లు పరిష్కరిస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు