వాషింగ్‌ మెషీన్‌లో బుసలు కొట్టిన నాగుపాము, వీడియో హల్‌చల్‌

14 Sep, 2021 16:58 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: టీవీ, సినిమాల్లో పాముతో కనిపించే భయానక దృశ్యాలను చూస్తేనే జడుసుకుంటాం. ఇక పాము ఇంట్లో కనిపిస్తే సరేసరి. భయంతో వణికిపోయి పరుగులు పెడతాం. అలాంటిది పామును చాలా దగ్గరగా అంటే.. అలవాటుగా ఇంటి పనులు చేస్తున్న సమయంలో.. సరాసరి అది మీద దూకే పరిస్థితే ఉంటే.. వామ్మో!.. తలుచుకుంటేనే అదోలా ఉంది కదా. 
(చదవండి: దారుణం: కూతురు ప్రేమించిన యువకునిపై సుత్తితో దాడి)

జిల్లాలోని ముమ్మిడివరం మండలం మహిపాల్ చెరువు గ్రామంలో కుంచే శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో అలాంటి పరిస్థితే ఎదురైంది. ఇంట్లోని వాషింగ్ మెషీన్‌లో దూరిన ఓ పొడవాటి నాగుపాము ఆ ఇంటి మహిళను హడలెత్తించింది. వాషింగ్‌ మెషీన్‌లో బట్టలు వేద్దామని దాని డోర్‌ తెరవగా.. అక్కడే తిష్ట వేసిన నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. వెంటనే స్నేక్‌ క్యాచర్‌ వర్మకు సమాచారం ఇవ్వగా ఆయన వచ్చి దానిని చాకచక్యంగా డబ్బాలో బంధించి అడవిలో వదిలిపెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.
(చదవండి: నిమజ్జనాలకు అనుమతి లేదనడంతో హైదరాబాద్‌లో ఆగమాగం..)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు