నూజివీడులో మంత్రి కన్నబాబు పర్యటన

28 Jun, 2021 16:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: నూజివీడును ఉద్యానవన పంటల హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని వ్యవ‌సాయశాఖ మంత్రి కుర‌సాల‌ కన్నబాబు తెలిపారు. సోమవారం నూజివీడులో పర్యటించిన ఆయన ఈ  సందర్భంగా మాట్లాడుతూ.. రూ.250 కోట్లతో జామ, మామిడి ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.2600 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో ఒక హార్టీ కల్చర్‌ హబ్‌, ఆయిల్‌ ఫామ్‌ రైతులకు ఓఈఆర్‌ ధర చెల్లిస్తున్నామని చెప్పారు. టన్ను రూ.7 వేల నుంచి రూ.19 వేలు దాటేలా చర్యలు తీసుకున్నామని, మామిడి తోటల పునరుద్ధరణకు రూ.20వేల ఆర్థికసాయం అందించునున్నట్లు భరోసా ఇచ్చారు. 

చదవండి: బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం.. మార్గదర్శకాలివే

మరిన్ని వార్తలు