బుల్లి వాక్యూమ్‌ క్లీనర్‌.. గిన్నీస్‌ రికార్డుల్లోకి

2 Mar, 2021 04:07 IST|Sakshi
‘గిన్నిస్‌ బుక్‌’ ప్రశంసా పత్రంతో నాదముని, (ఇన్‌సెట్‌లో) 1.76 సెం.మీ వ్యాక్యూమ్‌ క్లీనర్‌

ప్రపంచంలోనే అతి చిన్న వ్యాక్యూమ్‌ క్లీనర్‌ తయారీ

శ్రీకాళహస్తి: మారుమూల పల్లెటూరుకు చెందిన  యువకుడి అద్భుత ఆవిష్కరణకు గిన్నిస్‌ బుక్‌లో చోటు లభించింది. తను రూపొందించిన 1.76 సెంటీమీటర్ల అతి చిన్న వ్యాక్యూమ్‌ క్లీనర్‌ వరల్డ్‌ రికార్డు కొల్లగొట్టింది. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం శేషమనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన రామకృష్ణ, రమణమ్మ దంపతుల కుమారుడు తపాల నాదముని ఎన్‌ఐటీపీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాట్నా)లో బీఈ ఆర్కిటెక్చర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. 2016లో ఇన్‌స్పైర్‌ సైన్స్‌ మేళాలో పాల్గొని తన సత్తా చాటారు. తర్వాత 2.2 సెంటీమీటర్లు ఉన్న వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను తయారు చేసి ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.

అనంతరం మరింత లోతుగా అధ్యయనం చేసి ప్రపంచంలోనే అతి చిన్న వ్యాక్యూమ్‌ క్లీనర్‌ (1.76 సెంటీమీటర్లు)ను రూపొందించారు. దీనిపై నాదముని మాట్లాడుతూ.. 8 నెలల పాటు శ్రమించి, రూ.25 వేల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశానన్నారు. గిన్నిస్‌ బుక్‌ వారికి పంపించగా మూడు రోజుల క్రితం సర్టిఫికెట్‌ అందజేసినట్లు తెలిపారు. ఈ వ్యాక్యూమ్‌ క్లీనర్‌ క్లినికల్‌ ల్యాబొరేటరీల్లో వాడేందుకు ఉపయుక్తంగా ఉంటుందని వివరించారు. 

మరిన్ని వార్తలు