టూరిజం ప్రమోషన్స్‌ను రాజకీయాలతో ముడి పెట్టవద్దు

24 Jun, 2021 12:20 IST|Sakshi

మంత్రి అవంతి శ్రీనివాస్‌

సాక్షి, అమరావతి : నది పరివాహక ప్రాంతంలో బోటింగ్‌పై మంత్రి అవంతి శ్రీనివాస్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్రంలో 250 బోట్లు ఉన్నాయి..తొమ్మిది కమాండ్ కంట్రోల్ రూమ్స్ ద్వారా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాము. తూర్పుగోదావరిలో కర్ఫ్యూ ఉంది కనుక జూలైలో బోటింగ్‌ ప్రారంభం అవుతుంది. విదేశీ టూరిస్టుల కోసం విదేశీ మద్యం అందుబాటులో ఉంచుతామని చెప్పాము. అన్ని రాష్ట్రాల్లో టూరిస్టుల కోసం మద్యం ఉంటుంది. మేము కొత్తగా చేసింది కాదు, గతంలో కూడా ఇది అమల్లో ఉంది. కొందరు దీన్ని వక్రీకరించి.. దుష్ప్రచారం చేస్తున్నారు. 

టూరిజం ప్రమోషన్స్‌ను రాజకీయాలతో ముడి పెట్టవద్దు. చంద్రబాబు, లోకేష్ ప్రతి విషయానికి రాద్దాంతం చేస్తున్నారు. కోవిడ్ సమయంలో ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్‌లో కూర్చున్నారు. మాయలు చేయడంలో చంద్రబాబు దిట్ట.. చెప్పింది చేయడంలో సీఎం వైఎస్‌ జగన్‌ ముందుంటారు. అత్యధిక టెస్టులు చేసింది.. అత్యధికంగా వ్యాక్సినేషన్ చేసింది ఏపీనే’’నని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు