ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ అగ్రస్థానం: మంత్రి గౌతమ్‌రెడ్డి

26 Jul, 2021 15:51 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: ఈజ్‌ ఆఫ్ డూయింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పారిశ్రామిక అభివృద్ధిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త తరహా ఆలోచనలు చేస్తున్నారని పేర్కొన్నారు.

పరిశ్రమతో పాటు పరిసరాల అభివృద్ధి జరగాలన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో కోస్టల్‌ కారిడార్ ఉందని, రాబోయే రోజుల్లో పెట్టుబడులు బాగా వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో  పాటు స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించాలని జీవో తెచ్చామని తెలిపారు.

మరిన్ని వార్తలు