రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ 

26 Jul, 2021 15:04 IST|Sakshi

ప్లాట్‌ ఫామ్‌ టికెట్ ధరలను తగ్గించిన దక్షిణ మధ్య రైల్వే

సాక్షి, హైదరాబాద్‌: ప్లాట్‌ ఫామ్‌ టికెట్ ధరలను తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. గతంలో కోవిడ్ కారణంగా ప్రయాణికుల రద్దీ నియంత్రణకు ధరలు పెంచిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్, హైదరాబాద్‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధర రూ.50 నుంచి రూ.20కి తగ్గించారు. మిగతా స్టేషన్లలో ప్లాట్‌ ఫాం టికెట్ ధర రూ.10కి తగ్గిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నేరుగా కౌంటర్ వద్ద, లేదా యూటీఎస్ యాప్, క్యూఆర్ స్కాన్ ద్వారా తీసుకోవచ్చని కూడా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

మరిన్ని వార్తలు