నాటు నాటు పాటకు ఆస్కార్‌.. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్‌ ప్రశంసలు

14 Mar, 2023 15:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు లభించడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు రాజ్యసభలో ప్రస్తావించారు. నాటు నాటుకు ఆస్కార్‌ దక్కడం తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపుగా అభివర్ణించారు.

దీనిపై మంగళవారం రాజసభలో జీవీఎల్ మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డులు భారతీయ సినిమాకు ముఖ్యంగా తెలుగువారికి ఒక చారిత్రాత్మక గుర్తింపు అని అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం వాస్తవానికి తెలుగు చిత్రం.. ఆస్కార్ అవార్డు పొందిన ‘నాటు నాటు’ పాట తెలుగు పాట అని రాజ్యసభ సభ్యులందరికీ గుర్తు చేశారు.

ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విజయం ఒక్కటి మాత్రమే కాదని, దాని దర్శకుడు రాజమౌళి బాహుబలి లాంటి చిత్రాన్ని కూడా తెరకెక్కించారని, ఇది అంతర్జాతీయ విజయాన్ని సాధించిందని ఎంపీ జీవీఎల్ అన్నారు. రాజ్యసభలో నామినేటెడ్ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి రచయిత అని ప్రశంసించిన ఎంపీ జీవీఎల్.. ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు.
 

మరిన్ని వార్తలు