ప్రధాని విశాఖ సభ: ఏపీ ప్రభుత్వ భారీ జనసమీకరణ.. సభకు వచ్చేవాళ్లకు కీలక సూచనలివే

12 Nov, 2022 12:51 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ నగర పర్యటనలో భాగంగా సభలో పాల్గొనేందుకు పోటెత్తారు జనాలు. విశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలనే ఉద్దేశంతో.. ఏపీ ప్రభుత్వం జనసమీకరణ చేపట్టింది. 

ఈ సభకు కనివినీ ఎరుగని రీతిలో సుమారు మూడు లక్షల మంది ప్రజలు హాజరైనట్లు తెలుస్తోంది.  బస్సులు, రైళ్లు, ప్రత్యేక వాహనాల్లో జనాలను సభకు తరలించారు.  సభకు వచ్చిన దగ్గర నుండి మళ్లీ తిరిగి వెళ్లే వరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే 1.10 లక్ష మందికి ఆహారం సిద్ధం చేస్తున్నారు అధికారులు.  

ప్రధాని సభకు హాజరయ్యే వాహనదారులకు సూచనలు

► శ్రీకాకుళం విజయనగరం జిల్లా నుంచి ప్రధాని సభకు వచ్చే వాహనాలు మారికవలస.. తిమ్మాపురం.. కురుపాం సర్కిల్ నుంచి చిన వాల్తేరు మీదుగా ఏయూ గ్రౌండ్స్ కి చేరుకోవాలి

► భీమిలి నుంచి వచ్చే వాహనాలు మారి వలస తిమ్మాపురం జోడుగుల పాలెం చిన్న వాల్తేరు మీదుగా కృష్ణదేవరాయలు అతిథి గృహానికి చేరుకోవాలి

► మాడుగుల నుంచి వచ్చే రూట్ నెంబర్ 170 వాహనాలు పినగాడి వేపగుంట హనుమంతవాక కళాభారతి మీదుగా ఏయూ గ్రౌండ్స్ కు చేరుకోవాలి

► పెందుర్తి ఎస్ కోట చోడవరం నుంచి వచ్చే వాహనాలు అడవివరం శివాజీ పార్క్ మీదుగా రామలక్ష్మి అపార్ట్మెంట్ వద్ద ప్రజలను దించి నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ చేయాలి

► నర్సీపట్నం పాయకరావుపేట ఎలమంచిలి అనకాపల్లి నుంచి వచ్చే వాహనాలు ఎన్ ఎ డి కొత్త రోడ్.. తాటి చెట్ల పాలెం గురుద్వారా మీదుగా మద్దిలపాలెం వద్ద ప్రజలను దించాలి

► విశాఖ సౌత్ నుంచి బయలుదేరే ప్రజలు జ్ఞానాపురం ...ఫిషింగ్ హార్బర్ పార్క్ హోటల్ జంక్షన్ నుంచి చిన్న వాల్తేరు మీదుగా ఏయూ గ్రౌండ్స్ కి చేరుకోవాలి

► విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన ప్రజల వాహనాలు అప్పు ఘర్ మీదుగా ఆర్సిడి ఆసుపత్రి వద్ద వాహనాలను పార్కింగ్ చేయాలి

► వీఐపీలు తమ వాహనాలను నోవాటెల్... సర్క్యూట్ హౌస్ ...సెవెన్ హిల్స్ జంక్షన్ ఆసిల్ మెట్ట.. స్వర్ణ భారతి స్టేడియం నుంచి మద్దిలపాలెం వద్ద ఏయూ గ్రౌండ్స్ కి చేరుకోవాలి.

ఇదీ చదవండి: ప్రధాని పర్యటన.. ట్రాఫిక్‌ ఆంక్షలు ఇదిగో.. 

మరిన్ని వార్తలు