పోలవరం ప్రాజెక్టు నిర్మాణం; రాళ్ల నాణ్యత పరిశీలన

3 Sep, 2022 16:43 IST|Sakshi
పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో రాళ్ల నాణ్యత ప్రమాణాలు పరిశీలిస్తున్న సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ బృందం సభ్యులు

పోలవరం రూరల్‌ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వినియోగించే రాళ్ల నాణ్యత ప్రమాణాలను కేంద్ర జలసంఘంలోని సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (సీఎస్‌ఎం ఆర్‌ఎస్‌) బృందం సభ్యులు పరిశీలించారు. సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ సభ్యులు సందీప్‌ దనో త్, ఉదయ్‌ శుక్రవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. 


గైడ్‌ బండ్‌(రాతి గోడ) నిర్మాణానికి ఉపయోగించే రాళ్లను పరీక్షించారు. ఒక కిలోమీటరు పరిధిలో 53 మీటర్ల ఎత్తున రాతి గోడ నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు 42 మీటర్ల ఎత్తు వరకు నిర్మాణం పూర్తయింది. ఈ పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాన్ని కూడా వీరు ఆరా తీశారు. ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న ల్యాబ్‌లో కొన్ని పరీక్షలు నిర్వహించారు. శనివారం కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణ పనులను కూడా పరిశీలించనున్నారు. వీరి వెంట డీఈ శ్రీనివాసరావు, క్వాలిటీ కంట్రోల్, వ్యాబ్‌కోస్‌ అధికారులు ఉన్నారు. (క్లిక్‌: ‘బల్క్‌’ కుట్ర బహిర్గతం.. టీడీపీ పన్నాగం బట్టబయలు)

మరిన్ని వార్తలు