కత్తి పద్మారావుతో కొమ్మినేని భేటీ

28 Jan, 2023 19:27 IST|Sakshi

పొన్నూరు(గుంటూరు జిల్లా): ప్రముఖ రచయిత సామాజిక వేత్త కత్తి పద్మారావుతో ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు శనివారం మధ్యాహ్నం భేటి అయ్యారు. పొన్నూరులో కత్తి పద్మారావు ఇంటికి వెళ్ళి ఆయన్ను సత్కరించారు. ఇప్పటికి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాహిత్య రంగాలలో 80 పుస్తకాలు రచించిన పద్మారావు మరో 20 పుస్తకాలు రచించే పనిలో వున్నారు. ఈ సంధర్బంగా తాను రచించిన తన ఆటోబయోగ్రఫీ పుస్తకంతో పాటు ఆధునిక ఆంధ్ర రాజకీయాలు, భారత దేశ చరిత్ర - సామాజిక దృక్పథం, భారత రాజకీయాలు - అంబేద్కర్ దృక్పథం పుస్తకాలను కొమ్మినేనికి బహుకరించారు. కొమ్మినేని కూడ తాను రచించిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సామాజిక విశ్లేషణ పుస్తకాన్ని పద్మారావుకు అందచేసారు.  కత్తి పద్మారావు మాట్లాడుతూ దళిత పేద వర్గాలకు జగన్ ప్రభుత్వం చేస్తున్న పనులను అభినందించారు. 

ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లు ఎప్పటికప్పుడు సత్వరమే ఇవ్వాలని ఆయన సూచించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం అవార్డులిస్తే బాగుంటుందని... వ్యవసాయ భూములు లేని దళిత, పేద వర్గాలకు ఎంతో కొంత భూమిని ఇచ్చే ఏర్పాటు జగన్ ప్రభుత్వం చేయగలిగితే ఇక ఆయనకు తిరుగుండదని పద్మారావు వాఖ్యానించారు. ఒకే సారి లక్ష ముఫై వేల మందికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత భారత దేశ చరిత్రలో ఒక జగన్ ప్రభుత్వానిదేనని... అదొక రికార్డని కొమ్మినేని గుర్తు చేసారు. ఎన్నికల ప్రణాళికలోని హామీల ప్రకారం 98 శాతం అమలు చేసిన ఘనత జగన్‌దేనని కొమ్మినేని చెప్పారు. వివిధ పథకాలను పేదలకు మానవత హృదయంతో జగన్ అమలు చేస్తున్నారని పద్మారావు ప్రశంసించారు.

మరిన్ని వార్తలు