దివ్యకేసు: పురోగతి సాధించిన పోలీసులు

20 Oct, 2020 14:48 IST|Sakshi

సాక్షి, విజయవాడ: బీటెక్‌ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దివ్యను హత్య చేసినట్టు నిర్దారణ అయ్యింది. నిందితుడు నాగేంద్ర కాల్‌డేటాను పోలీసులు పరీశీలించారు. హత్య జరగడానికి  కొద్దిసేపటి ముందు నాగేంద్ర తన స్నేహితుడికి ఫోన్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో నాగేంద్ర స్నేహితుడు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. దివ్య హత్యకేసును దిశా పోలీసులు విచారిస్తున్నారు. దివ్య కుటుంబ సభ్యులతో పాటు, చుట్టు పక్కల వారిని  దిశా టీం విచారిస్తోంది. డీజీపీ ఆదేశాలతో  దిశ టీం శాస్త్రీయ ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది.

7 రోజుల్లో చార్జిషీటు: డీజీపీ సవాంగ్‌
దివ్యను కిరాతకంగా హత్య చేయడం బాధాకరమని, ఆమె కుటుంబానికి అండగా ఉంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ ఘటనపై సీఎం వైఎస్‌ జగన్ వెంటనే స్పందించారని చెప్పారు. హోంమంత్రి సుచరిత.. దివ్య కుటుంబ సభ్యులను స్వయంగా కలిసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 7 రోజుల్లో ఘటనపై చార్జిషీటు దాఖలు చేస్తామని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డీజీపీ పేర్కొన్నారు. 

చదవండి: దివ్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు: ఆడియోలు లీక్‌

మరిన్ని వార్తలు