విజయవాడ డివిజన్‌లో రైల్వే జీఎం వార్షిక తనిఖీలు 

17 Nov, 2021 04:39 IST|Sakshi
రాజమండ్రి సెక్షన్‌లోని బ్రిడ్జిలను తనిఖీ చేస్తున్న జీఎమ్‌ గజానన్‌మాల్య

రైల్వేస్టేషన్‌ (విజయవాడ 

(విజయవాడ పశ్చిమ):  దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య మంగళవారం విజయవాడ డివిజన్‌లోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ పోర్టు సెక్షన్‌లలో వార్షిక తనిఖీలు చేపట్టారు. ముందుగా విజయవాడ డీఆర్‌ఎమ్‌ షివేంద్రమోహన్, ఇతర అధికారులతో కలసి ఆయన విజయవాడ–నూజివీడు సెక్షన్‌లోని లెవల్‌క్రాసింగ్‌ గేట్‌లు, రైల్వేస్టేషన్, నూజివీడు–వట్లూరు సెక్షన్‌ల మధ్య వంతెనలు, లెవల్‌ క్రాసింగ్‌ గేట్‌లను తనిఖీ చేశారు. అక్కడ నుంచి వట్లూరు–ఏలూరు సెక్షన్‌లోని ట్రాక్‌లు, వంపులు, ఆర్‌యూబీల భద్రతా అంశాలను పరీక్షించి అక్కడి గ్యాంగ్‌ మెన్‌లతో మాట్లాడారు.

అనంతరం ఏలూరు స్టేషన్‌ చేరుకుని అక్కడ ప్రయాణికుల సౌకర్యాలను, సిబ్బంది పనితీరును సమీక్షించారు. అక్కడ నుంచి ఏలూరు–దెందులూరు సెక్షన్, పూళ్ల–చేబ్రోలు–బాదంపూడి–తాడేపల్లిగూడెం సెక్షన్, నవాబ్‌పాలెం–కొవ్వూరు–గోదావరి–రాజమండ్రి సెక్షన్‌లో పర్యటించి పలు వంతెనలను పరిశీలించారు. రాజమండ్రి స్టేషన్‌లో తనిఖీల అనంతరం మహిళా ఆర్‌పీఎఫ్‌ బ్యారక్‌ను ప్రారంభించి, వర్చువల్‌ విధానంలో సర్పవరం రైల్వేస్టేషన్‌లో 10 కేడబ్ల్యూపీ సోలార్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌లోని పలు విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు