నేడు ఉత్తర కోస్తాకు వర్ష సూచన

5 Apr, 2021 03:22 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సముద్ర తీరం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం మధ్యాహ్నం బలహీనపడింది. ఇటీవల మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా సోమవారం ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర ఏజెన్సీలో వర్షం కురిసే సూచనలున్నాయని కురుస్తుందని, ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని, నెల్లూరు, రాయలసీమల్లో ఉష్ణోగ్రత తీవ్రత మూడు రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు.

మిగిలిన జిల్లాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. గడిచిన 24 గంటల్లో కర్నూలు (40.5), అనంతపురం (40.2)లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో విశాఖ, కురుపాం, శృంగవరపుకోటలో 5, జియ్యమ్మవలసలో 3, కొమరాడ, చోడవరం, చింతపల్లిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

మరిన్ని వార్తలు