Rajahmundry: పాలన వికేంద్రీకరణపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం.. మేధావులు ఏమన్నారంటే

3 Oct, 2022 12:54 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి(తూర్పుగోదావరి): పాలన వికేంద్రీకరణపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత,ఎమ్మెల్యేలు, మేధావులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

మేధావులు చెప్పిన అంశాలను పక్కనపెట్టి..
రాష్ట్ర పునర్విభజన చట్టం సెక్షన్ 6లో ప్రస్తావించిన అనేక అంశాలు పరిశీలించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను గౌరవిస్తే బాగుండేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మేధావులు చెప్పిన అంశాలను పక్కనపెట్టి అమరావతి రాజధానిగా చంద్రబాబు పెట్టారన్నారు. రాజధాని అత్యంత ప్రాధాన్యత అంశం.. అందుకే శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తీసుకుని రాజధాని ఏర్పాటు చేయాల్సిందని కమిషన్ చెప్పిందని మంత్రి గుర్తు చేశారు. 

అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్‌ లక్ష్యం: మార్గాని భరత్‌
వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. అమరావతి కోసం లక్ష కోట్లు బడ్జెట్‌ కావాలన్నారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్‌ ఆకాంక్ష. రాజాధాని పేరుతో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్‌ లక్ష్యం అని ఎంపీ అన్నారు.


 

మరిన్ని వార్తలు