ఎమ్మార్వో కేసులో హైకోర్టు స్టే: సుప్రీం అసంతృప్తి

11 Sep, 2020 15:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మాజీ తహసిల్దార్ అన్నే శ్రీధర్‌పై  దాఖలైన క్రిమినల్ కేసు దర్యాప్తుపైన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్టే ఇవ్వడం పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అమరావతిలో భూసేకరణ పేరుతో పేద ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను ఆక్రమించిన ఎమ్మార్వోపై విచారణ జరపకుండా స్టే ఇవ్వడం సరైనది కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ దాఖలు చేసిన పిటిషన్‌ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు శుక్రవారం విచారణ చేపట్టారు. ఎమ్మార్వో శ్రీధర్‌పై పెద్ద ఎత్తున ఆరోపణలున్నా.. హైకోర్టు స్టే విధించడం సరైనది కాదని తదుపరి కేసు విచారణను ఈనెల 22కి వాయిదా వేశారు. 

అమరావతి ప్రాంతానికి చెందిన మాజీ తహసీల్దార్ అన్నే శ్రీధర్, బ్రహ్మానంద రెడ్డిలు పేదల భూములను ఆక్రమించారని స్థానిక ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమకు భూమి ఇవ్వకుంటే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రాకుండా చేస్తామని పేదలను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహరాన్ని ఏపీ ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో తమపై నమోదు చేసిన కేసులను రద్ద చేయాలని కోరుతూ నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల అభ్యర్థన మేరకు కేసు దర్యాప్తుపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది.  


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా