Nov 25th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

25 Nov, 2023 18:49 IST|Sakshi

మరో నాలుగు రోజుల కోసం వేచిచూస్తోన్న చంద్రబాబు

నవంబర్‌ 29తో ముగియనున్న కోర్టు ఆంక్షలు

నవంబర్‌ 30తో ముగియనున్న తెలంగాణ ఎన్నికలు

గత రెండు నెలలుగా గాడి తప్పిన తెలుగుదేశం

తెలంగాణలో పూర్తిగా సైకిల్‌ పంక్చర్‌, ఇప్పుడు ఏపీలో కింకర్తవ్యం?

ఏం చేస్తే తెలుగుదేశం పరువు కాపాడగలమన్నదానిపై బాబు కసరత్తులు

లోకేష్‌ సామర్థ్యం తేలిపోవడంతో చంద్రబాబులో గుబులు

ఇంకెన్ని రోజులు జాకీలు పెట్టి లేపాలని తలపట్టుకుంటోన్న పార్టీ అధినేత

TDP Chandrababu Cases Petitions And Political Updates..

04:10PM, Nov 25, 2023

పురందేశ్వరికి విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం

  • విశాఖలో మత్స్యకారుల బోట్లు అగ్నికి అహుతైన ఘటన మీ దృష్టికి రాలేదా పురంధేశ్వరి గారూ?
  • గతంలో అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు. వాళ్లంతా మీకు ఓట్లు వేసిన వారే.
  • వ్యక్తిగతంగానైనా, పార్టీ పరంగానైనా గంగపుత్రులను ఆదుకోవాలన్న ఆలోచన మీకు రాకపోవడం దురదృష్టం.
  • బాధితులకు బోటు విలువలో 80 శాతం ఆర్థిక సాయం అందించి ఆదుకుంది రాష్ట్ర ప్రభుత్వం.

1:25 PM, Nov 25, 2023
మాది ప్రజల పార్టీ, పవన్‌ది ప్యాకేజీ పార్టీ

  • అనకాపల్లి : పవన్ పై వైఎస్ఆర్ సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఫైర్
  • పవన్ లా మాది ప్యాకేజీ పార్టీ కాదు
  • పేదల పక్షాన నిలిచే పార్టీ వైఎస్ఆర్ సీపీ
  • షూటింగ్ లేనప్పుడు రాష్ట్రానికి వచ్చే పవన్ కు ప్రజల కోసం పోరాటం చేసే వైఎస్ఆర్ సీపీకి చాలా తేడా ఉంది
  • రాష్ట్రంలో ఉంటేనే కదా పవన్ కు అభివృద్ధి గురించి తెలుస్తుంది
  • బీసీలను పావులుగా వాడుకున్న టీడీపీకి పుస్తకాలు వేసే అర్హత లేదు
  • బీసీల్లో ఎన్ని కులాలు ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా
  • బీసీలకు మేలు చేసేవారైతే మాలా ధైర్యంగా యాత్రలు చేయగలరా?
  • పవన్ వ్యాఖ్యలు సినిమా డైలాగుల్లా ఉన్నాయి  
  • హైదరాబద్‌లో హెలికాప్టర్ మిస్సైతే ఏపీకి ఏం సంబంధం  
  • వైఎస్సార్‌సీపీతో జనసేనకు పోలికేంటి?
  • మరో 15,20 ఏళ్లు జగనే సీఎం
  • అధికారంలోకి వస్తానని పవన్ పగటి కలలు కంటున్నారు : వైవీ సుబ్బారెడ్డి

12:45 PM, Nov 25, 2023
ప్రభుత్వంపై పసలేని పవన్‌ విమర్శలు

ఎప్పుడు వైజాగ్ కి వద్దామనుకున్నా ఈ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుంది : పవన్ కళ్యాణ్

  •     అయ్యా పవన్‌ కళ్యాణ్‌.. మీరు లోకలా? నాన్‌ లోకలా?
  •     అసలు నెలకు ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్నారు?
  •     సినిమా షూటింగ్‌కు షూటింగ్‌కు మధ్య గ్యాప్‌లో ఏపీలో వాలి విమర్శలెందుకు చేస్తున్నారు?
  •     మీరు ఏ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు? ఏ ఎన్నికల్లో మీరు పోటీ చేస్తున్నారు?
  •     నెలలో రెండు రోజులు కనిపిస్తారు, మళ్లీ దరిదాపుల్లోకి రాకుండా వెళ్లిపోతారు?
  •     మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే.. నిజాయతీగా ఏదైనా సమస్యపై పోరాడారా?
  •     వారాహి యాత్ర అంటారు.. రోజుల కొద్ది షెడ్డులో వ్యాన్‌ పెడతారు..!
  •     మీదొక పార్టీయేనా? లేక తెలుగుదేశం పార్టీకి బీ టీమా?
  •     మీకు, మీ పార్టీకి ఏమైనా సిద్ధాంతాలున్నాయా?
  •     మీరు విశాఖ రావడానికి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించాల్సిన అవసరం ఏముంది?
  •     మీరు ఇలాగే ప్రవర్తిస్తే.. ప్రజలే మిమ్మల్ని తరిమే పరిస్థితి వస్తుందేమో.! : YSRCP


 (ఫైల్‌ ఫోటో : చంద్రబాబు అరెస్ట్‌ అవగానే రోడ్డు మీద పడుకుని నిరసన తెలుపుతున్న పవన్‌ కళ్యాణ్‌)

12:33 PM, Nov 25, 2023
నవంబర్‌ 29 కోసం చంద్రబాబు ఎదురుచూపులు

  • నవంబర్‌ 29తో కోర్టు ఆంక్షలు, నవంబర్‌ 30తో తెలంగాణ ఎన్నికలు
  • సైకిల్‌ రిపేర్‌కు సమయం ఆసన్నమయిందన్న ఆలోచనలో చంద్రబాబు
  • ఏం చేద్దాం? ఎలా చేద్దాం? పార్టీ శ్రేణులను ఎలా చైతన్యపరచాలి?
  • ఇచ్ఛాపురం వరకు నడవమంటే లోకేష్‌ వినడాయే?
  • రెగ్యులర్‌గా ఏపీలో ఉండి వారాహి  యాత్ర చేయమంటే పవన్‌ వినడాయే?
  • నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టమంటే సీనియర్లు పట్టించుకోరాయే?
  • కనీసం సింగిల్‌గా తెలుగుదేశం పోటీ చేద్దామంటే గెలుస్తుందన్న నమ్మకం లేదాయే?
  • పవన్‌ కళ్యాణ్‌ను నమ్ముకుని తెలుగుదేశం ముందుకెళ్లగలదా?
  • ఇన్నాళ్లు తిరిగిన చక్రం ఇప్పుడు రాష్ట్రంలో అసలే తిరగడం లేదెందుకు?
  • ఢిల్లీలో మన మాటకు ఈ స్థాయిలో విలువెందుకు తగ్గిపోయింది?
  • కార్యకర్తలను ఏమని చెప్పి ఒప్పించాలి?
  • జనసేనకు కేటాయించే సీట్లపై టిడిపి క్యాడర్‌కు ఏమని చెప్పాలి?

12:17 PM, Nov 25, 2023
సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు!

  • మద్యం కేసులో సుస్పష్టంగా బయటపడుతున్న ఆధారాలు
  • నోట్ ఫైళ్లపై చంద్రబాబు, కొల్లు రవీంద్ర సంతకాలు
  • అడ్డగోలుగా మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్ ఫీజులు రద్దు
  • ప్రభుత్వ ఖజానాకు రూ.1,299.64 కోట్లు నష్టం  వాటిల్లేలా పావులు కదిపిన చంద్రబాబు
  • ఆర్ధిక శాఖ అనుమతి, ఆమోదం లేకుండా తతంగం
  • కేబినెట్ భేటీ ముగిశాక గుట్టుగా చీకటి జీవోలు జారీ
  • టీడీపీ సర్కారు తీరును తప్పు బట్టిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్
  • ఇన్నాళ్లూ మా బాబుకు ఏమీ తెలియదంటూ బుకాయించిన ఎల్లో గ్యాంగ్

12:05 PM, Nov 25, 2023
ఇదీ పవన్ కల్యాణ్ అసలు రంగు : CPM

  • విజయవాడ : పవన్‌ కళ్యాణ్‌ గురించి CPM నేత శ్రీనివాసరావు వ్యాఖ్యలు
  • జనసైనికులను పవన్ మోసం చేస్తున్నారు
  • పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజన్ సర్కారు కావాలంటున్నారు
  • పవన్ కు బుల్డోజర్ పాలన కావాలా?
  • ప్రశ్నిస్తానన్న పవన్ బీజేపీని ఏనాడైనా ప్రశ్నించారా?
  • బీజేపీ ఇస్తున్నవి పాచిపోయిన లడ్డూలు అని విమర్శించలేదా?
  • ఇప్పుడు మళ్లీ బీజేపీకి పవన్ వంత పాడుతున్నారు : శ్రీనివాసరావు

12:03 PM, Nov 25, 2023
విశాఖలోనే పవన్ కల్యాణ్

  • విశాఖలోనే ఉండిపోయిన పవన్‌ కళ్యాణ్‌
  • తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం సాయంత్రం తాండూరు వెళ్లనున్న పవన్
  • నిన్న బోటు ఘటన కోసం వచ్చిన పవన్‌ కళ్యాణ్‌
  • ఇవ్వాళ పార్టీ ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో పవన్‌ సమావేశం
  • సమన్వయ కమిటీ సమావేశాల గురించి పార్టీ నేతలతో పవన్‌ చర్చలు
  • ఉత్తరాంధ్రలో ఎన్ని చోట్ల పార్టీకి అవకాశాలున్నాయన్న దానిపై ఆరా
  • తెలుగుదేశం ఎన్ని చోట్ల పోటీ చేయాలి? జనసేనకు అవకాశమెక్కడుంది?
  • పవన్‌ గాజువాక నుంచి పోటీ చేయాలా? లేదా అన్నదానిపై నిర్ణయం
  • గత ఎన్నికల్లో గాజువాక అని ఊరించి దెబ్బ తీశారన్న యోచనలో పవన్‌
  • ఉత్తరాంధ్రలో కచ్చితంగా గెలుస్తావని పవన్‌కు నాడు చెప్పిన పార్టీ నేతలు
  • గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పార్టీ పరిస్థితి ఎలా ఉందన్నదానిపై ఆరా

11:33 AM, Nov 25, 2023
విశాఖ మిలీనియం టవర్స్‌పై పచ్చ మీడియా విష ప్రచారం

ఈనాడు ఏం రాసింది?

  • ఐటీ సంస్థల కోసం చంద్రబాబు మిలీనియం టవర్స్‌ నిర్మిస్తే  దాన్ని వేరే అవసరాలకు ప్రభుత్వం వాడుకుంటోందని, ఇది ఐటీ అభివృద్ధికి అడ్డంకి అని, క్యాండ్యూయెంట్‌కు నోటీసులంటూ, HSBC వెళ్ళిపోయింది అని వాపోయింది.

ఇందులో నిజమెంత?

వాస్తవాలు ఒక సారి పరిశీలిద్దాం

  • విశాఖలో నిర్మించిన వాటిలో రెండు టవర్‌లు ఉన్నాయి. టవర్‌–A, టవర్‌–B పేరిట ఉన్న రెండింటినీ మిలీనియం టవర్స్‌ పేరుతో పిలుస్తున్నారు.
  • దీన్లో ఒక్కదాన్ని కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు.
  • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.60 కోట్లకుపైగా నిధులు ఖర్చు పెట్టి అసంపూర్తిగా ఉన్న టవర్‌–Aను పూర్తి చేయటమే కాక, కొత్తగా టవర్‌–Bని నిర్మించింది
  • టవర్‌–B ఈ ఏడాదే పూర్తయింది. ప్రస్తుతం ఖాళీగా ఉంది.
  • మరి దాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా తన అవసరాల కోసం వాడుకుంటే తప్పా?
  • ప్రభుత్వ విభాగానికైనా, ప్రభుత్వ విద్యా సంస్థలకైనా ప్రత్యేక భవనాలు నిర్మించే  పరిస్థితి లేకుంటే అందుబాటులో ఉన్న భవనాలు వినియోగంలోకి తీసుకురావడం తప్పెలా అవుతుంది?
  • చంద్రబాబు మాదిరి ప్రభుత్వ విభాగాలను ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో  లేదా బాబు అనుకూల బిల్డింగ్స్ లో పెట్టి పెట్టి భారీ అద్దెలు చెల్లించాలా?

క్యాండ్యూయెంట్‌కు నోటీసులంటూ పచ్చి అబద్ధాలు..

  • ‘టవర్‌–ఏ’లో  ఐటీ సంస్థ కాండ్యుయెంట్‌ తప్ప వేరే కంపెనీలేవీ కార్యకలాపాలు కొనసాగించడం లేదు . కాండ్యుయెంట్‌కు విస్తరణ కోసం అదనపు స్థలం అడిగినా ఇవ్వలేదని, పైపెచ్చు ఖాళీ చేయమంటూ నోటీసులు జారీ చేశారని ఈనాడు దుష్ప్రచారం చేస్తోంది.
  • మరి క్యాండ్యూయెంట్‌ ఏం చెబుతోంది?
  • ప్రభుత్వం మాకు ఎలాంటి నోటీసులూ ఇవ్వలేదు. కొన్ని పత్రికలు ప్రచారం చేస్తున్నట్టు మాకు హైదరాబాద్‌కు షిప్ట్‌ అయ్యే ఆలోచన లేనే లేదు. దీనిపై ఇప్పటికే పలు మార్లు ప్రకటనలిచ్చాం. అయినా ఈ విషప్రచారానికి మాత్రం తెరపడటం లేదు.

HSBC వెళ్లిపోయిందెప్పుడో తెలియదా?

  • చైనాకు చెందిన HSBC తన విధానపరమైన నిర్ణయంలో భాగంగా భారతదేశ కార్యకలాపాల నుంచి వైదొలుగుతున్నట్లు 2016లో ప్రకటించింది. అందులో భాగంగా విశాఖ, హైదరాబాద్, ఢిల్లీల్లోని తన కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబే

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఐటీ కంపెనీలను ఆకర్షించడం కోసం ప్రభుత్వం ఐటీ ఇన్‌ఫ్రాను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది.

  • అదానీ గ్రూప్‌ డేటా సెంటర్‌తో పాటు భారీ ఐటీ టవర్‌ను నిర్మిస్తోంది. రహేజా గ్రూపు ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణంతో పాటు ఐటీ టవర్‌ను కడుతోంది.
  • ఏపీఐసీసీ రూ.2,300 కోట్ల వ్యయంతో మధురవాడలో 19 ఎకరాల విస్తీర్ణంలో ‘i Space’ పేరిట ఐటీ టవర్‌ను నిర్మిస్తోంది.
  • చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో విశాఖకు చెప్పుకోదగ్గ పేరున్న ఒక్క కంపెనీ కూడా రాలేదు.
  • కానీ సీఎం జగన్‌ ప్రభుత్వం బీచ్‌ డెస్టినీ పేరిట ఐటీ కంపెనీలను విశాఖకు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది.
  • ఇందులో భాగంగా ఇన్ఫోసిస్‌ ఇప్పటికే డేటా సెంటర్‌ను ప్రారంభించగా, విప్రో డేటాసెంటర్‌ను ప్రారంభించడానికి వీలుగా విశాఖలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న ఉద్యోగుల సమాచారాన్ని సేకరిస్తోంది.
  • ఇక అమెజాన్, బీఈఎల్‌ , రాండ్‌స్టాడ్‌ వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి.
  • మరికొన్ని సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి.

చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 24,,350 మంది ఐటీ ఉద్యోగులుండగా ఇపుడా సంఖ్య 53,850 దాటింది.

11:04 AM, Nov 25, 2023
చంద్రబాబు హయాంలో మద్యం అక్రమాలపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్

  • మద్యం ప్రివిలేజి ఫీజు తొలగించి చంద్రబాబు, కొల్లు రవీంద్ర 1300 కోట్లు కొల్లగొట్టారు
  • రూ.1500 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది
  • కళ్లద్దాల వల్ల పురంధేశ్వరి గారికి ఇలాంటివి కనిపించవు
  • పున్నమ్మా.. దాన్ని ఇప్పటి ప్రభుత్వానికి అంటగట్టేయత్నం చేయడం అన్యాయం అనిపించడం లేదా?
     

10:15 AM, Nov 25, 2023
విశాఖపై విష ప్రచారం

  • విశాఖ : మిలినియం టవర్స్‌పై పచ్చమీడియా, టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం
  • కంపెనీలు వెళ్లిపోతున్నాయంటూ  దుష్ప్రచారం
  • మిలినియం టవర్స్‌లో ఉన్న కంపెనీలకు ఎలాంటి నోటీసులూ ఇవ్వని ప్రభుత్వం
  • టవర్‌ - ఏలో కొనసాగుతున్న కాండియట్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ ఇండియా కంపెనీ
  • మాకు ఎలాంటి నోటీసులు రాలేదని, స్పష్టంచేసిన కాండియట్‌ బిజినెస్‌ సర్వీసెస్‌
  • మా ఉద్యోగులు చక్కగా పనిచేస్తున్నారని వెల్లడించిన కాండియట్‌
  • ప్రస్తుతం టవర్‌ -బిలో ఎలాంటి కంపెనీలూ లేవు
  • ఈ మధ్యే  ప్రభుత్వానికి అప్పగింత
  • ఖాళీ ఉన్న కార్యాలయాలనే పరిపాలన కోసం వినియోగించాలని నిర్ణయం
  • విశాఖలో పరిపాలన అనగానే తెగబడి తప్పుడు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా

09:08 AM, Nov 25, 2023
'బావ’సారూప్యం అంటే ఇదేనేమో!.. ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌

  • చంద్రబాబు.. బీజేపీలోకి పంపించిన కోవర్టులంతా ఆ పార్టీని గాలికొదిలి టీడీపీ భజన చేస్తున్నారు
  • క్రిమినల్ కేసుల్లో అరెస్టయి కడప జైలులో టీడీపీ జిల్లా నాయకులను.. పురందేశ్వరి సలహా మేరకు రాష్ట్ర బీజేపీ నాయకులు పరామర్శించి.. సానుభూతి ఒలకబోయడం ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లింది.
  • 'బావ’సారూప్యం అంటే ఇదేనేమో!
     

07:53 AM, Nov 25, 2023
చంద్రబాబు, పవన్‌లు పొలిటికల్‌ టూరిస్ట్‌లు: మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ 

  • ఉత్తరాంధ్రపై ఎందుకంత అక్కసు?
  • సీఎం ఎక్కడి నుంచైనా పాలించవచ్చు
  • విశాఖకు కార్యాలయాలు తరలింపుపై విషం కక్కుతున్నారు
  • ఈ ప్రాంతం ఏపీలో లేదా? విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ను ప్రజలు హర్షిస్తున్నారు

     

07:45 AM, Nov 25, 2023
చంద్రబాబు ముఠాకు ఎదురుదెబ్బ 

  • ఫైబర్‌నెట్‌ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌ 
  • ఏడు స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు న్యాయస్థానం అనుమతి  
  • ఈ కేసులో నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహి­తుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఏసీబీ న్యాయ­స్థానం అనుమతి
  • సీఐడీ దాఖలు చేసిన అటాచ్‌మెంట్‌ పిటిషన్‌ను ఆమోదిస్తూ న్యాయ­స్థానం ఉత్తర్వులు
  • ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు
  • ఇందులో చంద్ర­బాబు ఏ–25, ఏ–1 వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీ, ఏ–13 టెరా­సాఫ్ట్‌ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్‌

07:27 AM, Nov 25, 2023
నోట్‌ ఫైళ్లపై చంద్రబాబు, కొల్లు రవీంద్ర సంతకాలు వెలుగులోకి

  • అడ్డగోలుగా మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్‌ ఫీజులు రద్దు
  • ప్రభుత్వ ఖజానాకు రూ.1,299.64 కోట్లు నష్టం
  • ఆర్థిక శాఖ అనుమతి, ఆమోదం లేకుండా తతంగం
  • కేబినెట్‌ భేటీ ముగిశాక గుట్టుగా చీకటి జీవోలు జారీ
  • టీడీపీ సర్కారు తీరును తప్పుబట్టిన ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌
  • ఇన్నాళ్లూ మా బాబుకు ఏమీ తెలియదంటూ బుకాయించిన ఎల్లో గ్యాంగ్‌

07:21 AM, Nov 25, 2023
స్కిల్‌ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది?

  • టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్‌ స్కాం
  • నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం
  • జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం అంటూ ప్రచారం
  • సీమెన్స్‌ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం
  • ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు
  • అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు
  • షెల్ కంపెనీల ద్వారా  రూ 241 కోట్ల పక్కదారి
  • విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్‌
  • పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్)
  • ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST
  • విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు
  • స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ
  • నిధులన్నీ సూట్‌కేస్‌ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖ
  • కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్‌మెంట్లను గుర్తించిన CID
  • రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి
  • ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్
  • చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్‌ విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు
  • సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ
  • 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్‌ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు
  • సెప్టెంబర్‌ 10న రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు
  • ఐదు పర్యాయాలు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు
  • రిమాండ్‌ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు
  • కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్‌ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
  • నవంబర్‌ 20న రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

07:12 AM, Nov 25, 2023
పొత్తుల్లో నాది అంతులేని కథ : పవన్‌ కళ్యాణ్‌

  • రాజకీయ పొత్తులపై ముసుగు తీసిన పవన్‌ కళ్యాణ్‌
  • ఏ పార్టీతోనైనా కలుస్తాను
  • చాలా మంది నాది ఏ ఇజం, ఒక్కోసారి ఒక్కోలా ఉంటాను అంటారు..,
  • కమ్యూనిస్ట్ తో కలుస్తాడు, బీజేపీ వాళ్ళతో ఉంటారు అంటారు..
  • నాది హ్యుమనిజం : పవన్‌ కళ్యాణ్‌
  • ప్రస్తుతం తెలంగాణలో బీజేపీతో పొత్తు, ఏపీలో టీడీపీతో పొత్తు
  • గతంలో బీఎస్పీతో పొత్తు, అంతకు ముందు కమ్యూనిస్టులతో పొత్తు
  • పొత్తుల్లో కొత్త రికార్డు దిశగా పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేన
మరిన్ని వార్తలు