Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

22 Sep, 2022 17:43 IST|Sakshi

1. ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టండి: సీఎం జగన్‌
ఇళ్ల నిర్మాణంపై గృహ నిర్మాణ, రెవెన్యూ, పురపాలక-పట్టణాభివృద్ధి, గిరిజన సంక్షేమశాఖలతో తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. గృహనిర్మాణంలో ప్రగతిపై సమగ్రంగా సమీక్షించారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. వైఎస్సార్‌సీపీ శాశ్వత అధ్యక్ష పదవిపై సజ్జల క్లారిటీ
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జీవిత కాల అధ్యక్ష పదవీ తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరస్కరించారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఎం జగన్‌ తిరస్కరించడం వల్ల ఆ నిర్ణయం మినిట్స్‌లోకి ఎక్కలేదన్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. హెచ్‌సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్‌..! మంత్రి షాకింగ్‌ కామెంట్స్‌
జింఖానా తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. హెచ్‌సీఏ నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులతో సమావేశమయ్యారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఏపీని ముందుండి నడిపిస్తున్న పాలనాదక్షుడు సీఎం జగన్‌: మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశంసలతో ముంచెత్తారు. ఏపీ కష్టాల్లో కూరుకుపోయినపుడు జగన్‌ ముందుండి నడిపించిన తీరును ఆయన కొనియాడారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. జింఖానా ‘తొక్కిసలాట’.. మహిళను కాపాడేందుకు ఆ లేడీ కానిస్టేబుల్‌ ఏం చేసిందంటే?
సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ వద్ద ఉదయం ఆసీస్‌-భారత్‌ మ్యాచ్‌ టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ లేడీ కానిస్టేబుల్‌ చాకచక్యంగా వ్యవహరించింది. ప్రాణాపాయంలో ఉన్న మహిళకు వెంటనే సీపీఆర్‌ చేసి ఆ ప్రాణాన్ని నిలబెట్టింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. అధ్యక్ష పదవికి పోటీపై రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు.. గహ్లోత్‌ పరిస్థితి ఏంటో?
కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తాజాగా పార్టీ అధ్యక్ష పదివికి పోటీ విషయంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. చైనా సర్కార్‌కు సవాల్‌ విసురుతున్న దెయ్యాల నగరాలు
ఒక్క రియల్ ఎస్టేట్ రంగం నష్టాల్లో కూరుకుపోతే దేశ ఆర్ధిక వ్యవస్థే  తల్లకిందులైపోతుందా ఏంటి? అని చాలా మంది బుగ్గలు నొక్కుకోవచ్చుకానీ.. చైనా విషయంలో మాత్రం అది నూటికి నూరు పాళ్లూ నిజమే అంటున్నారు ఆర్ధిక వేత్తలు. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. హెచ్‌సీఏ కీలక నిర్ణయం! రాత్రి 7 గంటల నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు!
భారత్‌- ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 టిక్కెట్ల అమ్మకం నేపథ్యంలో జింఖానా గ్రౌండ్‌లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సిరీయస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో  రాష్ట్ర క్రీడా శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో చర్చల అనంతరం హెచ్‌సీఏ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. ‘పగ పగ పగ’ మూవీ రివ్యూ
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటి సారిగా విలన్ పాత్రలో కనిపిస్తోన్న చిత్రం ‘ పగ పగ పగ’.అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్‌, మూవీ మోషన్ పోస్టర్‌, కోటి నటించిన పాత్రకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌‌కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం నేడు(సెప్టెంబర్‌ 22)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. జాబ్‌ కోసం వెతుకుతున్నారా..? జాగ్రత్త.. లింక్డ్‌ ఇన్‌ ప్లాట్‌ఫారమ్‌లో..
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న లింక్డ్‌ ఇన్‌ ప్లాట్‌ఫారమ్‌ వృత్తిపరమైన వ్యక్తులతో కనెక్ట్‌ అవడానికి, జాబ్‌సెర్చ్‌లకు సహాయపడుతుంది. జనాదరణ పొందిన ఈ ప్లాట్‌ఫారమ్‌ను స్కామర్‌లు మోసాలకు ఉపయోగించుకుంటున్నారు.
👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు