ప్రభుత్వోద్యోగులకు కలిసొచ్చిన వచ్చే ఏడాది సెలవులు

1 Dec, 2023 02:50 IST|Sakshi

2024లో మొత్తం 20 ప్రభుత్వ సెలవులు

ఇందులో 11 సెలవులు సోమ, శుక్ర, శనివారాల్లోనే

ఆదివారం సెలవులో కలిసిపోయిన  భోగి, విజయదశమి, అంబేడ్కర్‌ జయంతి 

2024 సెలవుల క్యాలండర్‌ను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది (2024) పండుగలు, పర్వదినాల సెలవులు కలిసొచ్చాయి. 2024కు రాష్ట్ర ప్రభుత్వం 20 సాధారణ సెలవులను ప్రకటించగా అందులో 11 సెలవులు వారాంతం లేదా వారం ప్రారంభంలోనే వచ్చాయి. 2024కు  సంబంధించి  ప్రభుత్వ సాధారణ సెలవులు, ఐచ్చిక సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024 సంవత్సరానికి 20 సాధారణ సెలవులతో పాటు 17 ఐచ్చిక సెలవులను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిలో గరిష్టంగా అయిదు ఐచ్చిక సెలవులను వినియోగించుకోవచ్చని  స్పష్టం చేశారు. చంద్ర దర్శనం బట్టి మారే రంజాన్, బక్రీద్, మొహర్రం,, మిలాద్‌ ఉల్‌ నబీ వంటి పర్వదినాలతో పాటు తిధుల ప్రకారం మారే హిందూ పండుగల వివరాలను తరువాత ఆయా పరిస్థితులకు అనుగుణంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. అటువంటి సందర్భాల్లో సాధారణ ఉత్తర్వులు వచ్చే వరకు ఆగకుండా ఆయా శాఖాధిపతులు తగు నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు