సంప్రదాయ భోజనంపై దుష్ప్రచారమా?

29 Aug, 2021 03:06 IST|Sakshi

తిరుమలలో నిరంతరాయంగా నిత్యాన్నదానం

పలు క్యాంటీన్ల ద్వారా నిర్వహణ

వీటన్నింటికీ అదనంగా గో ఆధారిత సంప్రదాయ భోజనం

ఇందుకు ఏ మేర ఖర్చు అవుతుందో అంతే వసూలు 

భక్తులు అవాస్తవాలు నమ్మొద్దని టీటీడీ విజ్ఞప్తి   

తిరుమల: శ్రీవారి భక్తులను గంగరగోళానికి గురిచేసి, టీటీడీకి చెడ్డపేరు తేవడమే లక్ష్యంగా సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తున్న భక్తులకు టీటీడీ అందిస్తున్న నిత్యాన్నదానం నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు స్వామి వారి నిత్యాన్నదానాన్ని స్వీకరించి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది. ఇటీవల టీటీడీ ఒక పెద్ద క్యాంటీన్‌లో భక్తులకు గో ఆధారిత సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది.చదవండి: పంటలకు ‘ధ్రువీకరణ’ ధీమా

ఇది విజయవంతమైతే ఈ భోజనం తయారీకి ఎంత ఖర్చు అవుతుందో అంత మాత్రమే (కాస్ట్‌ టు కాస్ట్‌) భక్తుల నుంచి స్వీకరించనుంది. అయితే ఈ విషయాన్ని కొందరు గందరగోళపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం గమనించి టీటీడీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. బయట ఆహారాన్ని తీసుకోవాలనే శ్రీవారి భక్తులకు లాభాపేక్ష లేకుండా రుచికరమైన గో ఆధారిత సంప్రదాయ భోజనాన్ని అందించాలనే లక్ష్యంతోనే ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భక్తులు, దాతలు అసత్య ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.  చదవండి: చదవండి: Andhra Pradesh: పేద విద్యార్థులకు... టాప్‌ వర్సిటీల్లో సీట్లు

మరిన్ని వార్తలు