30 నుంచి ఆ రెండు బ్యాంకుల సమ్మె

25 May, 2022 20:40 IST|Sakshi

పెదవాల్తేరు(విశాఖ తూర్పు): పలు డిమాండ్ల సాధనలో భాగంగా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సమ్మెకు దిగనున్నాయి. ఒప్పందాలకు విరుద్ధంగా అధికారులు, సిబ్బందికి బదిలీలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సెంట్రల్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగులు ఈ నెల 30, 31 తేదీల్లో  సమ్మె చేయనున్నారు. అలాగే, ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సిబ్బంది ఈ నెల 30న సమ్మెకు దిగనున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో అటెండర్‌ స్థాయి పోస్టులను శాశ్వత ప్రాతిపదికన కాకుండా ఔట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయడాన్ని సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు.

(చదవండి: రైలు ప్రయాణికులకు అలర్ట్‌; పలు రైళ్ల రద్దు)

మరిన్ని వార్తలు