పేదల గుండె చప్పడు వైఎస్సార్‌: ఆవంతి శ్రీనివాస్

9 Jul, 2021 07:55 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : పేదల గుండెచప్పుడు తెలిసిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్డర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొనియాడారు. ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిఉంటారన్నారు. గురువారం మద్దిలపాలెం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి జీవితం అందరికీ అదర్శమన్నారు. రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వైనం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ సందర్భంగా సేవాదళ్‌ నగర మహిళా అధ్యక్షరాలు, రజక కార్పొరేషన్‌ చైర్మన్‌ ఈగలపాటి యువశ్రీ నిర్వహణలో పలువురు రక్తదానం చేశారు.  

బీచ్‌రోడ్డులో... 
బీచ్‌రోడ్డులోని వైఎస్సార్‌ విగ్రహానికి నగర మేయర్‌ హరివెంకట కుమారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ముత్తంశెట్టి మాట్లాడారు. వైఎస్సార్‌ జయంతిని ‘రైతు దినోత్సవం’గా రాష్ట్ర ప్రజలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. మేయర్‌ హరివెంకట కుమారి మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించారని, ఒక మహిళను హోమ్‌ మినిస్టర్‌ చేసిన ఘనత ఆయనదేనన్నారు. వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షడు వంశీకృష్ణశ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి చేసిన మేలు, సంక్షేమ పథకాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ మాట్లాడుతూ మహానేత వైఎస్సార్‌ లేని ఆంధ్రప్రదేశ్‌ను ఊహించుకోలేమన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, కేకే రాజు, అక్కరమాని విజయనిర్మల, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, ఎస్‌ఏ రెహమాన్, తిప్పల గురుమూర్తిరెడ్డి, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకటరామయ్య, కార్పొరేషన్‌ చైర్మన్లు కోలా గురువులు, మధుసూదన్‌రావు, పి.సుజాత నూకరాజు, పి.సుజాత సత్యనారాయణ, పార్టీ అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, మొల్లి అప్పారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, పార్టీ ముఖ్యనాయకులు పీవీఎస్‌ రాజు, అల్లంపల్లి రాజుబాబు, ద్రోణంరాజు శ్రీవాత్సవ, సతీష్‌వర్మ, మంత్రి రాజశేఖర్, కాశీవిశ్వనాథం, పేడాడ రమణికుమారి, కార్పొరేటర్లు రెయ్యి వెంకటరమణ, శశికళ, బర్కత్‌ అలీ, మొల్లి లక్ష్మి, చిన్న జానికీరామ్, కెల్లా సత్యనారాయణ, అప్పలరత్నం, విల్లూరి భాస్కరరావు, కార్పొరేషన్‌ డైరెక్టర్లు బి.పద్మావతి, పేర్ల విజయచందర్, షబీర్‌ బేగం, జిల్లా, నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు జి. శ్రీధర్‌రెడ్డి, బి.కాంతారావు, బోని శివరామకృష్ణ, షరీఫ్, బాకి శ్యాంకుమార్‌రెడ్డి, మారుతిప్రసాద్, పైడి రత్నాకర్, మైకల్‌రాజ్, చొక్కర శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు