సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన మోషేన్‌రాజు

18 Jun, 2021 21:06 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ నేత మోషేన్‌రాజు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఉన్నారు.

కాగా, గవర్నర్‌ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో కొత్తగా లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), ఆర్వీ రమేష్‌కుమార్‌ (వైఎస్సార్‌ కడప), మోషేన్‌రాజు (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి) ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్‌రాజు.. వైఎస్‌ జగన్‌ పార్టీని ప్రకటించిన మరుక్షణమే కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. టీడీపీ ప్రభుత్వ నిర్బంధకాండలోనూ వైఎస్‌ జగన్‌తో కలిసి ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 

చదవండి: ఏపీ శాసన మండలి ప్రొటెం స్పీకర్‌గా విఠపు బాలసుబ్రహ్మణ్యం
ధాన్యం కొనుగోలు: రూ.1,637 కోట్లు రైతులకు చెల్లింపు

మరిన్ని వార్తలు