‘వైజాగ్‌లో రాజధాని వద్దని చంద్రబాబుకు ఎవరైనా చెప్పారా?’

22 Nov, 2023 18:37 IST|Sakshi

సాక్షి, విశాఖ: ఏపీలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర బుధవారం విశాఖపట్నం జిల్లా విశాఖ సౌత్, నంద్యాల జిల్లా బనగానపల్లి, ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. బస్సుయాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ నేతలు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

విశాఖలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. చంద్రబాబు మోసాలు నుంచి ఉత్తరాంధ్ర ప్రజల మేలుకోవాలి. విశాఖను రాజధానిగా చేస్తే చంద్రబాబు అడ్డుకుంటున్నారు. వైజాగ్ రాజధాని అయితే యువతకు ఇక్కడే ఉపాధి లభిస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగుతాయి. విశాఖ రాజధాని అయితే ఇక్కడ భూములకు రేట్లు పెరుగుతాయి. ఒక కులం కోసం అమరావతి నీ రాజధాని చేశారు. వైజాగ్‌లో రాజధాని వద్దని చంద్రబాబుకు ఎవరైనా చెప్పారా?. 

వైజాగ్ రాజధాని అయితే మాఫియా పెరుగుతుందని అబద్ధాలు చెబుతున్నారు. సిగ్గు లేకుండా రామోజీ రావు అబద్ధాలు రాస్తున్నారు. వెనుక బడిన కులాలు అంటే చంద్రబాబుకు ఒక ద్వేషం. తోలు తీస్తానని చంద్రబాబు మత్స్యకారులను బెదిరించారు. చంద్రబాబును ఓడించిదే ఒక మత్స్య కారుడే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అవమనిచింది చంద్ర బాబు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం వారిని గౌరవించారు. 

విశాఖలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ‘అలీబాబా 40 దొంగల్లా చంద్రబాబు ముఠా దోచుకుంది. పదేళ్ళ ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదిలి వచ్చేశారు. రాష్ట్రంలో పెత్తందార్లకు, పేదలకు మధ్య య ఉద్ధం జరుగుతోంది. పేదల పక్షాన సీఎం జగన్ నిలబడ్డారు. మార్పు అనేది సీఎం జగన్‌తోనే సాధ్యం. సామాజిక సాధికార యాత్ర అనుకున్న దానికంటే ఎక్కువగా విజయవంతం అవుతున్నాయి. 

ఎంతమంది కలిసిన జగన్‌తోనే జనం అంటున్నారు. సింహం ఎన్నడూ సింగిల్‌గానే వస్తుంది. బడుగు బలహీనర్గాల గౌరవాన్ని ముఖ్యమంత్రి జగన్ పెంచారు. పిల్లల భవిష్యత్‌కు బాటలు వేశారు. మళ్ళీ జగన్ సీఎం అయితేనే బడుగుల జీవితాల్లో వెలుగులు ఉంటాయి. ముఖ్యమంత్రి జగన్‌ను మరోసారి సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. పేదల దైవం సీఎం జగన్’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

మరిన్ని వార్తలు