సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా బడ్జెట్‌

1 Feb, 2021 14:28 IST|Sakshi

కేంద్ర బడ్జెట్‌ నిరాశ పరిచింది..

వైఎస్సార్‌సీపీ ఎంపీలు

సాక్షి, ఢిల్లీ: రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయకపోవడం నిరాశ కలిగించిందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు.  బడ్జెట్‌ కేటాయింపులపై ఢిల్లీలో వారు మీడియాతో మాట్లాడారు. ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ, సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా బడ్జెట్‌ ఉందని పేర్కొన్నారు. (చదవండి: కేంద్ర బడ్జెట్‌: ఇల్లు కట్టుకునే మధ్యతరగతి వర్గాలకు ఊరట

కేంద్ర బడ్జెట్‌ చాలా నిరాశ పరిచిందని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ఉపాధి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. రాష్ట్రానికి 20 వేల కోట్లు  రెవెన్యూ లోటు ఉందన్నారు.ఎంపీలందరూ కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రానికి నిధులు తీసుకువస్తామని ఆయన తెలిపారు.(చదవండి: బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం: విజయసాయిరెడ్డి)

ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ, రైల్వే జోన్‌కు నిధులు కేటాయించకపోవడం నిరాశ పరిచిందని, ఫిషింగ్ హార్బర్ కేటాయించడం ఒక కంటి తుడుపు చర్యగా ఆయన పేర్కొన్నారు. ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద పనిదినాలు పెంచాలని, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో 16 కొత్త మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలని... గత ఏడాది కేవలం మూడు మెడికల్‌ కాలేజీలకు మాత్రమే నిధులు ఇచ్చారని అనకాపల్లి ఎంపీ సత్యవతి అన్నారు. ఏపీకి రావాల్సిన నిధులు కోసం ఎంపీలందరూ కలిసి పోరాడతామన్నారు. మహిళలకు ప్రాధాన్యత కల్పించే అంశాలు బడ్జెట్‌లో లేవని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు