ఒకే మాట.. ఒకే బాట

5 Mar, 2023 01:34 IST|Sakshi
బ్రహ్మోత్సవాల్ల్లో భాగంగా వాహనాల్లో కొలువుదీరి గ్రామంలో ఊరేగుతున్న స్వామివారు

గుర్రంకొండ : ఆధునిక సమాజమలో తరాలు మారుతున్నా సంస్కృతి, సంప్రదాయలు సజీవంగానే ఉన్నాయనేందుకు తరిగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహోత్సవాలే నిదర్శనం. స్వామివారి బ్రహోత్సవాలు జరిగే 11 రోజుల పాటు తరిగొండ పంచాయతీలోని గ్రామాలు, పరిసర 24 గ్రామాల ప్రజల ఒకే మాట మీద నిలబడి సంస్కృతి, సంప్రదాయాలను నేటికి పాటిస్తున్నారు. గ్రామాల్లో జంతువధ, మాంసం విక్రయాల వినియోగం పూర్తిగా నిషేధం. ఈసంప్రదాయాన్ని కేవలం హిందువులు మాత్రమే కాకుండా ముస్లింలు కూడా ఆచరిస్తుండడం విశేషం.బ్రహోత్సవాలు జరిగే సమయాల్లో ఘాటు వస్తువులైన ఎండు మిర్చి, ధనియాలు వంటివి పిండిమిషన్లలో ఆడించడం లేదా ఇళ్లలోని రోళ్లలో దంచడం వంటివి చేయక పోవడం గమనార్హం.

కంకణధారణతో నిబంధనలు అమలు

స్వామివారి బ్రహోత్సవాలు ప్రారంభంరోజున నిర్వహించే అంకురార్పణలో అర్చకులు కంకణాలు కట్టడం సంప్రదాయం. అప్పటి నుంచి నిబంధనలు మొదలవుతాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారు ఉదయం, సాయంకాలం వాహనాల్లో ఆలయం నుంచి గ్రామ పురవీధుల్లో విహరిస్తారు. ప్రతిరోజు, వీధులు పరిశుభ్రంగా ఉంటాయి. ఇందుకోసం ప్రత్యేక పారిశుధ్య కార్మికులు ఉంటారు.

ఘాటు వస్తువులకు దూరం

గ్రామాల్లో ఎండుమిర్చి, ధనియాలు వంటి ఘాటు వస్తువులకు ప్రజలు దూరంగా ఉంటారు. ఉగ్ర నారసింహుడైన స్వామివారు బ్రహోత్సవాల వేళ గ్రామంలో వాహనాల్లో ఊరేగింపుగా వచ్చే సమయంలో ఘాటు వస్తువుల వాసనాలు రాకూడదనేది ఇక్కడి ప్రజల నమ్మకం. ఆయా గ్రామాల్లో ఎలాంటి శుభ కార్యాలు నిర్వహించరు. పెళిళ్లకు మంచి ముహుర్తాలు ఉన్నాకానీ వివాహాలు జరిపించరు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.ఆ సమయంలో సాధారణ ప్రజలు పెళ్లిళ్లు చేసుకోకూడదనేది ఇక్కడి ఆచారం. కనీసం ఇళ్లముందుపందిళ్లు కూడా వేసుకోరు.ప్రతి ఒక్కరూ కల్యాణం రోజు ఉపవాసాలు ఉండడం ఆనవాయితీగా వస్తోంది. తరిగొండ,పరిసర గ్రామాల్లో హిందువులతో పాటు ముస్లింలు ఈ సంప్రదాయాలను పాటిస్తుండడం విశేషం. గ్రామంలో 1500 మంది ముస్లింలు నివాసం ఉంటున్నారు. బ్రహోత్సవాల సమయంలో మాంసం దుకాణాలు మూసివేస్తారు. హిందువుల సంప్రదాయాలను గౌరవిస్తూ, పరమత సహనం పాటిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా ఇక్కడి ముస్లింలు నిలుస్తున్నారు.

సంప్రదాయాలు పాటిస్తున్నారు

స్వామివారి బ్రహోత్సవాలు జరిగే అన్ని రోజుల్లో హిందువులే కాకుండా ముస్లింలు కూడా ఇక్కడి సంప్రదాయాలను గౌరవిస్తారు. మాంసం విక్రయాలకు దూరంగా ఉంటారు. స్వామివారికి రక్తపు మరకలు పడవు. దీంతో గ్రామాల్లో జంతు ఽవధ నిషేధం. ఎన్ని తరాలూ మారుతున్నా బ్రహోత్సవాల సమయంలో ఇక్కడి ప్రజలు సంప్రదాయాలను పాటిస్తుంటారు.

– గోపాల బట్టర్‌, ఆలయప్రధానఅర్చకులు, తరిగొండ

చికెన్‌ దుకాణాలను మూసివేస్తాం

స్వామివారి బ్రహోత్సవాలు జరిగే 11 రోజుల పాటు గ్రామంలో చికెన్‌, మటన్‌ దుకాణాలను మూసివేస్తాం. చికెన్‌ విక్రయాలు ఇక్కడ నిర్వహించం. స్వామివారు ప్రతిరోజు తమ దుకాణాల ముందు వాహనాల్లో వెళుతుంటారు. ఆ సమయంలో రక్తపు మరకలు ఉండకూడదనేది ఇక్కడి సంప్రదాయం. దీంతో తాము కూడా వారి సంప్రదాయాలను గౌరవిస్తూ మాంసపు దుకాణాలను మూసివేస్తాం. – మస్తాన్‌, చికెన్‌ సెంటర్‌ నిర్వాహకుడు, తరిగొండ

ఆనవాయితీ కొనసాగుతోంది

స్వామివారి బ్రహోత్సవాలు జరిగే రోజుల్లో గ్రామంలో ఘాటు వస్తువులైన ఎండుమిర్చి, ధనియాలు వంటి వాటి పొడులు తయారు చేడయడం ఇక్కడ నిషేధం. పిండిమిషన్లలో కూడా వీటి పొడులను తయారు చేయరు. ఇళ్లలో సీ్త్రలు కూడా రోళ్లలో వీటిని వేసి దంచరు. ఇలా చేయడం ఆనవాయితీగా వస్తోంది. – సురేష్‌, తరిగొండ.

బ్రహ్మోత్సవాల వేళ మాంసం విక్రయాలు, వినియోగం నిషేధం

సంప్రదాయాలు పాటిస్తున్న ముస్లింలు

ఆదర్శంగా నిలుస్తున్న

24 గ్రామాల ప్రజలు

జంతు వధ నిషేధం

బ్రహ్మోత్సవాల వేళ తరిగొండతో పాటు పరిసర 24 గ్రామాల్లో జంతు వధ నిషేధం. స్వామివారు గ్రామంలో వివిధ వాహనాల్లో సంచరిస్తాడు. ఆ సమయంలో ఎక్కడ కుడా రక్తపు మరకలు ఇళ్ల ముందుగానీ, వీధుల్లో గానీ కనిపిస్తే స్వామివారి ఆగ్రహానికి గురికావడమే కాకుండా ఆయా గ్రామాలకు కీడు జరుగుతుందనేది పెద్దల నమ్మకం. దీంతో ఎక్కడ కూడా జంతు బలులు, వధ నిర్వహించరు.

మరిన్ని వార్తలు