సామాజిక సాధికార యాత్ర విజయవంతం | Sakshi
Sakshi News home page

సామాజిక సాధికార యాత్ర విజయవంతం

Published Fri, Nov 24 2023 1:40 AM

- - Sakshi

కడప కార్పొరేషన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కడప నగరంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రభం’జనం’ సృష్టించింది. గురువారం ఉదయం నుంచే కడపలో ఉత్సాహ పూరిత వాతావరణం నెలకొంది. జనం నీరాజనాలు పలికారు. బస్సు యాత్ర సాగే రోడ్డులో రవీంద్రనగర్‌ నుంచి ఏడురోడ్ల కూడలి వరకు భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు కనువిందు చేశాయి. రోడ్ల వెంట కట్టిన వైఎస్సార్‌ సీపీ మూడు రంగుల జెండాలు రెపరెపలాడాయి. మధ్యాహ్నం 3.25 గంటలకు యూఎస్‌ మహల్‌ నుంచి బస్సు యాత్ర ర్యాలీ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ర్యాలీ వెంట లంబాడీలు తమ నృత్యాలతో, డప్పు వాయిద్య కళాకారులు తమ విన్యాసాలతో, వైఎస్సార్‌సీపీ జెండాలతో గుర్రపు స్వారీ చేసేవారు అగ్రభాగాన కొనసాగారు. ర్యాలీ ప్రారంభంలో వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఉన్నారు. డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్‌, శాసనమండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌ జకియాఖానమ్‌, ఎమ్మెల్సీలు రమేష్‌ యాదవ్‌, ఎంవీ రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ, మాజీ ఎంపీ బుట్టా రేణుక, వేర్‌ హౌస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కరీముల్లా, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్‌, జిల్లా కోశాధికారి హఫీజుల్లా, డాక్టర్‌ సొహైల్‌ తదితరులు ర్యాలీ వెంట నడిచారు. వారికి స్థానిక ప్రజలు, మహిళలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.పూలు చల్లుతూ భారీ ఎత్తున బాణాసంచా పేల్చుతూ మంగళ హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. యూఎస్‌ మహల్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ రవీంద్రనగర్‌, పాతబస్టాండు మీదుగా ఏడురోడ్ల కూడలికి చేరింది. భవనాలకు కట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్‌బాషా చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. పాత బస్టాండులో మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీలో నడుస్తున్న వైఎస్సార్‌ సీపీ నేతలను అభిమానులు పాత బస్టాండు, ఏడురోడ్ల కూడలిలో గజమాలలు తెచ్చి క్రేన్ల సాయంతో వారికి అలంకరించి ఘనంగా సత్కరించారు.

సామాజిక సాధికార యాత్ర విజయవంతం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కడప నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన సామాజిక సాధికార యాత్ర విజయవంతమైంది. అత్యధిక సంఖ్యలో మహిళలు, యువత ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అన్ని డివిజన్ల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. యూఎస్‌ మహల్‌లో మధ్యాహ్నం 12.25 గంటలకు మేధావులతో సమావేశం నిర్వహించారు. 1.30 గంటలకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. 2 గంటలకు ముఖ్యనేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. 3.25 గంటలకు సామాజిక సాధికార బస్సుయాత్ర ర్యాలీ ప్రారంభౖమైంది. 4.20 గంటలకు ఏడురోడ్ల కూడలిలో బహిరంగ సభ ప్రారంభ మై 5.55 గంటలకు ముగిసింది. ఏర్పాట్లను డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, వారి సోదరుడు అహ్మద్‌బాషాలు చేశారు.

వైఎస్సార్‌సీపీ శ్రేణులతో మురిసిన కడప నగరం

నాయకులకు అడుగడుగునా అపూర్వ స్వాగతం

అలరించిన లంబాడీ నృత్యాలు, డప్పు వాయిద్యాలు

కడపలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్రలో పొల్గొన్న  వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజలు
1/3

కడపలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్రలో పొల్గొన్న వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజలు

అలరించిన లంబాడీల నృత్యాలు
2/3

అలరించిన లంబాడీల నృత్యాలు

3/3

Advertisement
Advertisement