జగనన్న ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది | Sakshi
Sakshi News home page

జగనన్న ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది

Published Fri, Nov 24 2023 1:40 AM

- - Sakshi

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రజా సంక్షేమానికి

ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా పేదల బతుకులు బాగుపడ్డాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

–సాక్షి నెట్‌వర్క్‌

జగనన్న ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది

జగనన్న ప్రభుత్వంలో మాకు ఇల్లు మంజూరైంది. ప్రస్తుతం స్లాబ్‌ దశ లో ఇంటి పనులు జరుగుతున్నాయి. జగనన్న కు రుణపడి ఉంటాం.

– ఉప్పుతోల్ల సుమలత, కొత్తపల్లె,

చౌటపల్లి గ్రామం, లక్కిరెడ్డిపల్లె మండలం.

పాఠశాలల రూపురేఖలు మారాయి

నాడు– నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి. మా పాఠశాలలో మొదటి విడత నిధులతో పాఠశాల విద్యుద్దీకరణ, భవనాల మేజర్‌, మైనర్‌ మరమ్మతులు, ఆర్‌ఓ ప్లాంటు, హ్యాండ్‌వాష్‌, గ్రీన్‌చాక్‌బోర్డులు ఏర్పాటు చేసుకున్నాము. రెండవ విడత మంజూరైన నిధులతో బాలికలకు టాయిలెట్లు, వంటగది, తాగునీటికోసం బోరు డ్రిల్లింగ్‌, పైపులైన్‌ ఏర్పాటుతో పాటు 4 తరగతి గదుల నిర్మాణం పూర్తయింది. పాఠశాలల ముఖచిత్రాల్లో మార్పు, వసతుల కల్పనతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతో హుషారుగా బడికి వస్తున్నారు.

– జాబీర్‌,ఉపాధ్యాయుడు, రాయచోటి

సొంత గూడు నిర్మించుకున్నాం

జగనన్న ప్రభుత్వం తోడ్పాటుతో సొంతగూడును నిర్మించుకోగలిగాము. ఎన్నో ఏళ్లుగా పక్కాగృహాల నిర్మాణం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. జగనన్న ప్రభుత్వంలో ఎలాంటి సిఫార్సు లేకుండా అర్హతే ఆధారంగా జగనన్న కాలనీలో ఇల్లు మంజూరైంది. చాలా సంతోషంగా ఉంది.

– ఎం.సరస్వతి, లబ్ధిదారురాలు, రాయచోటి

1/3

2/3

3/3

Advertisement
Advertisement