విద్యా వ్యవస్థకు పునాదులు వేశారు

12 Nov, 2023 01:32 IST|Sakshi
ఆజాద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు

రాయచోటి : భారత దేశ విద్యా వ్యవస్థకు పునాదులు వేసిన మహనీయుడు మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ అని జిల్లా కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ అన్నారు. భారత తొలి విద్యాశాఖామంత్రి మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా రాయచోటి ఎస్పీ కార్యాలయంలో జాతీయ విద్య, మైనార్టీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు ఎస్పీ బి.కృష్ణారావు, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ ఆజాద్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ యూజీసీ, ఐఐఎంల స్థాపనలో మౌలానా కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ మత సామరస్యాన్ని చాటిన నాయకుడు అబ్దుల్‌ కలాం ఆజాద్‌ అని కొనియాడారు.

కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాషా, తదితరులు మైనార్టీల దినోత్సవం నిర్వహించారు. మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈవీఎంల తనిఖీ

రాయచోటి : సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన స్ట్రాంగ్‌ రూములను కలెక్టర్‌ గిరీషా పీఎస్‌ శనివారం పరిశీలించారు. రాయచోటి సాయి ఇంజినీరింగ్‌ కళాశాలలో కొన్ని గదులను జిల్లా ఎస్పీ కృష్ణారావు, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌లతో గదులను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ స్ట్రాంగ్‌ రూముల భద్రత పకడ్బందీగా ఉండాలని పోలీసులకు సూచించారు. సహకరించాలని కళాశాల యాజమాన్యాన్ని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు