Sakshi News home page

విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి

Published Sun, Nov 12 2023 1:32 AM

మాట్లాడుతున్న అంబవరం ప్రభాకర్‌రెడ్డి  
 - Sakshi

కడప ఎడ్యుకేషన్‌ : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను విద్యలో ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులకు కృషి చేయాలని విద్యాశాఖ రాష్ట్ర పర్యవేక్షకురాలు కల్పన, సమగ్రశిక్ష జిల్లా పథక అధికారి అంబవరం ప్రభాకరెడ్డి అన్నారు. కడపలోని గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫౌండేషన్‌ లిటరసీ, న్యూమరసీలో భాగంగా మహిళా శిశు సంక్షేమశాఖలో పనిచేస్తున్న చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు సూపర్‌వైజర్లకు, ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నిర్వహించిన రెసిడెన్సియల్‌ శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల వయస్సు గల పిల్లలు తప్పకుండా చదవడం, రాయడం, చతుర్విద పక్రియలను చేయగలిగేలా తీర్చిదిద్దడమే శిక్షణ ముఖ్య ఉద్దేశమన్నారు. సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజ పురోగతికి, పేదరిక నిర్మూలనకు విద్య ఒక్కటే ప్రధానమార్గం అన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకుని ఉన్నతస్థానాలు అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ ధనలక్ష్మి, ఏఏఎంఒ రామాంజనేయరెడ్డి, జీసీడీవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement