గ్రహం అనుగ్రహం (01-12-2020) 

1 Dec, 2020 06:10 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.పాడ్యమి ప.3.37 వరకు, తదుపరి విదియ నక్షత్రం రోహిణి ఉ.8.20 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం ప.2.20 నుంచి 4.03 వరకు, దుర్ముహూర్తం ఉ.8.29 నుంచి 9.12 వరకు తదుపరి రా.10.29 నుంచి 11.21 వరకు అమృతఘడియలు... రా.12.39 నుంచి 2.22 వరకు.

సూర్యోదయం :    6.17
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: రుణదాతల ఒత్తిడులు. కుటుంబసభ్యులతో తగాదాలు. చేపట్టిన పనులు  నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలలో నిరుత్సాహమే. ఉద్యోగాలలో  ఒత్తిడులు.

వృషభం: ముఖ్య పనులు పూర్తి. సమాజసేవలో పాలుపంచుకుంటారు. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. కొంత సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మిథునం: కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. అగ్రిమెంట్లు వాయిదా. పరిస్థితులు అనుకూలించవు. వ్యాపార నిర్వహణలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో అనుకోని బదిలీలు. 

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో సంతోషకరమైన వార్తలు. 

సింహం: ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సన్నిహితులతో సఖ్యత. వాహనాలు, స్థలాలు కొంటారు. దైవదర్శనాలు.  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. కార్యక్రమాలలో  ఆటంకాలు. వివాదాలకు దూరంగా ఉండండి. స్నేహితులతో కలహాలు. రాబడి అంతగా కనిపించదు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం. 

తుల: కుటుంబ సమస్యలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు నెలకొంటాయి.  అనుకోని ప్రయాణాలు. వ్యాపార లావాదేవీల్లో చిక్కులు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

వృశ్చికం: దూరపు బంధువుల కలయిక. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనుల్లో విజయం. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడుల నుంచి విముక్తి.

దనుస్సు: నూతన ఉద్యోగాలు. వ్యవహారాలలో పురోగతి. కొత్త వ్యక్తుల పరిచయం.  ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాబడి ఆశాజనకం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి.

మకరం: మిత్రులతో విభేదాలు.  ప్రయాణాలు వాయిదా. కొన్ని పనులు మధ్యలో విరమించే అవకాశం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు.

కుంభం: కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. రాబడి నిరుత్సాహపరుస్తుంది.
వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు ఊహించని మార్పులు..

మీనం: పూర్వపు మిత్రుల నుంచి కీలక సమాచారం. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కొత్త పరిచయాలు. పనులు సకాలంలో పూర్తి.  వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత సానుకూలత.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా