గ్రహం అనుగ్రహం (09-10-2020)

9 Oct, 2020 06:17 IST|Sakshi

గ్రహఫలం

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు అధిక ఆశ్వయుజ మాసం, తిథి బ.సప్తమి వ.12.19 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం ఆరుద్ర రా.8.16 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం లేదు, దుర్ముహూర్తం ఉ.8.15 నుంచి 9.04 వరకు, తదుపరి ప.12.10 నుంచి 12.57 వరకు అమృతఘడియలు... ఉ.9.49 నుంచి 11.27 వరకు.

సూర్యోదయం :    5.54
సూర్యాస్తమయం    :  5.41
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

మేషం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

వృషభం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో వివాదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మిథునం: సన్నిహితులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దైవదర్శనాలు. శుభవర్తమానాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు.

కర్కాటకం:సన్నిహితులతో విభేదిస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు.

సింహం: కార్యజయం. ధనలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. నూతన ఉద్యోగలాభం. సోదరుల నుంచి పిలుపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

కన్య: చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఎదురుండదు.

తుల: వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమ తప్పదు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చికం: మిత్రులతో విభేదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

ధనుస్సు:శుభవార్తా శ్రవణం. కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా విజయమే. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొత్త ఇబ్బందులు.

మకరం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. స్వల్ప ధనలాభం. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రగతి కనిపిస్తుంది.

కుంభం: కొన్ని పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు