గ్రహం అనుగ్రహం (25-07-2020)

25 Jul, 2020 05:40 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువుశ్రావణ మాసం, తిథి శు.పంచమి ప.2.23 వరకు, తదుపరి షష్ఠినక్షత్రం ఉత్తర సా.5.22 వరకు, తదుపరి హస్త, వర్జ్యం రా.1.11 నుంచి 2.40 వరకు, దుర్ముహూర్తం ఉ.5.41 నుంచి 7.21 వరకుఅమృతఘడియలు... ఉ.10.35 నుంచి 12.05 వరకు గరుడపంచమి.

సూర్యోదయం :    5.40
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

గ్రహఫలం
మేషం....ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వస్తు, వస్త్రలాభాలు. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

వృషభం...సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా ఉంటాయి. పనుల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

మిథునం....రాబడికి మించిన ఖర్చులు. బంధుమిత్రులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. పనులు కొన్ని విరమిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు.

కర్కాటకం....ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ధనలబ్ధి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ లక్ష్యాలు ఫలిస్తాయి.

సింహం....పనుల్లో ప్రతిబంధకాలు. ప్రయాణాలలో అవాంతరాలు. కొత్తగా రుణయత్నాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తులు వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

కన్య....పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

తుల...చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి గందరగోళం.

వృశ్చికం....శుభవార్తా శ్రవణం. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పనులలో పురోగతి. బంధువుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు..

ధనుస్సు...రుణాలు తీరుస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం. దైవదర్శనాలు. ప్రముఖుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సానుకూల పరిస్థితులు.

మకరం...కుటుంబంలో సమస్యలు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. నిరుద్యోగులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం....శ్రమపడ్డా ఫలితం ఉండదు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం...పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ధన,వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

మరిన్ని వార్తలు