ఈ రాశి వారు కొన్ని పనులు వాయిదా వేస్తారు

25 May, 2021 06:20 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువువైశాఖ మాసం, తిథి శు.చతుర్దశి రా.7.50 వరకు, తదుపరి పౌర్ణమి నక్షత్రం స్వాతి ఉ.6.01 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం ప.11.12 నుంచి 12.43 వరకు, దుర్ముహూర్తం ఉ.8.03 నుంచి 8.54 వరకు, తదుపరి రా.10.49 నుంచి 11.33 వరకు, అమృత ఘడియలు.. రా.8.08 నుంచి 9.52 వరకు. రోహిణీ కార్తె ప్రారంభం.

సూర్యోదయం :    5.30
సూర్యాస్తమయం    :  6.23
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

రాశి ఫలాలు:

మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. విద్యార్థులు, నిరుద్యోగులకు ముఖ్య సమాచారం. ఆస్తి వివాదాలు తీరతాయి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. 

వృషభం: శుభకార్యాల రీత్యా ఖర్చులు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రముఖుల ప్రశంసలు. వృత్తి,వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆహ్వానాలు అందుతాయి. 

మిథునం: పనులు మందగిస్తాయి. సోదరులు, మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. విద్యార్థుల యత్నాలు ముందుకు  సాగవు. వృత్తి, వ్యాపారాలలో అనుకోని మార్పులు. 

కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. రుణయత్నాలు. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమ తప్పదు. బంధువులతో స్వల్ప విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు. 

సింహం: విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. సోదరులతో విభేదాలు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు అధిగమిస్తారు. 

కన్య: మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు అధికమవుతాయి. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రతిబంధకాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. 

తుల: బంధువుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. గృహం, వాహనయోగాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి. చర్చలు సఫలం. 

వృశ్చికం: వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. 

ధనుస్సు: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. 

మకరం: చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వస్తులాభాలు. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. 

కుంభం: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. రుణయత్నాలు. పనుల్లో అవరోధాలు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి. దైవచింతన. 

మీనం: పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనారోగ్యం. 
 

మరిన్ని వార్తలు