ఈ రాశికి ప్రముఖులతో పరిచయాలు, ఆకస్మిక వస్తులాభం

1 Mar, 2023 06:50 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.నవమి ఉ.6.33 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: మృగశిర ఉ.11.57 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: రా.9.05 నుండి 10.51 వరకు, దుర్ముహూర్తం: ప.11.50 నుండి 12.34 వరకు, అమృతఘడియలు: రా.3.10 నుండి 4.56 వరకు.

సూర్యోదయం :    6.24
సూర్యాస్తమయం    :  6.01
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుండి 9.00 వరకు 

మేషం: ఆకస్మిక వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సందేశం. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం. భూలాభాలు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం: ముఖ్య పనుల్లో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యభంగం. ఉద్యోగ ప్రయత్నాలలో అవాంతరాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

మిథునం: ముఖ్యమైన  పనులలో విజయం. మిత్రుల ద్వారా శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కర్కాటకం: వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

సింహం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం. విందువినోదాలు. కార్యసిద్ధి. సన్మానాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.

కన్య: శుభవార్తలు. ఆదాయం ఉత్సాహాన్నిస్తుంది. అనుకున్న పనులు చేపడతారు. ప్రముఖులు పరిచయం. సంఘంలో గౌరవం. వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

తుల: బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

వృశ్చికం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక విషయాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన ఉద్యోగయోగం. వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మకరం: పోటీపరీక్షల్లో విజయం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

కుంభం: పనులు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఉద్యోగ ప్రయత్నాలు నిదానిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మీనం: ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రమే. ఉద్యోగాలలో నిరుత్సాహం.

మరిన్ని వార్తలు