ఈ రాశి వారు శుభవార్తలు వింటారు

5 May, 2022 06:16 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి శు.చవితి ఉ.7.08 వరకు, తదుపరి పంచమి నక్షత్రం ఆరుద్ర పూర్తి (24గంటలు), వర్జ్యం ప.1.15 నుండి 3.00 వరకు, దుర్ముహూర్తం ఉ.9.50 నుండి 10.40 వరకు తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు అమృతఘడియలు... రా.7.26 నుండి 9.13 వరకు. 

సూర్యోదయం :    5.36
సూర్యాస్తమయం    :  6.16
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

రాశి ఫలాలు..

మేషం: చకచకా వ్యవహారాలు చక్కదిద్దుతారు. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: మిత్రులతో విరోధాలు. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. రుణబాధలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు.

మిథునం: మిత్రుల చేయూత అందుతుంది. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. మానసిక ఆందోళన. కుటుంబంలో సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

సింహం: వ్యవహారాలలో పురోగతి. భూలాభాలు. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కన్య: రుణఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు, సూచనలు పాటిస్తారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలం.

తుల: పనుల్లో ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం: కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొత్త సమస్యలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: పాతబాకీలు వసూలవుతాయి. ఆప్తుల నుంచి పిలుపు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మకరం: నేర్పుగా సమస్యలు పరిష్కరించుకుంటారు. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: మిత్రులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తులు వివాదాలు. మీ ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందికరమైన పరిస్థితి.

మీనం: రాబడి అంతగా కనిపించదు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. అనారోగ్యం. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.
 

మరిన్ని వార్తలు