ఈ రాశి వారికి శుభవార్తలు అందుతాయి, వస్తు లాభం

30 Jan, 2023 06:51 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: శు.నవమి ప.2.04 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: కృత్తిక రా.1.41 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: ప.1.16 నుండి 2.55 వరకు, దుర్ముహూర్తం: ప.12.35 నుండి 1.22 వరకు, తదుపరి ప.2.51 నుండి 3.34 వరకు, అమృతఘడియలు: రా.11.05 నుండి 12.46 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.38, సూర్యాస్తమయం: 5.50. 

మేషం: రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు.

వృషభం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మిథునం: ప్రయాణాలు వాయిదా పడతాయి. పనుల్లో ప్రతిష్ఠంభన. బంధుమిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కర్కాటకం: వ్యవహారాలలో పురోగతి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. వాహనయోగం. ఆలయాలు  సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని విధంగా ఉంటుంది.

సింహం: పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

కన్య: పరిస్థితులు అనుకూలించవు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు.

తుల: రుణయత్నాలు సాగిస్తారు. మిత్రుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో స్వల్ప చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చికం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

ధనుస్సు: శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

మకరం: సన్నిహితులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఒడిదుడుకులు.

కుంభం: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో అవాంతరాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: శ్రమ ఫలిస్తుంది. సోదరులు, మిత్రుల నుంచి కీలక సమాచారం. ఆర్థికాభివృద్ధి. కుటుంబంలో ఆదరణ లభిస్తుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు